A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెజి ఆస్పత్రి లో నిద్రపోతే మంత్రి పదవి పోయింది
Share |
April 20 2019, 7:40 pm

విశాఖపట్నంలో కెజి ఆస్పత్రిలో నిద్ర చేస్తే పదవి పోతుందా? బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శాసనషభలో ఈ వ్యాఖ్య చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ను కూడా ఆయన కెజి ఆస్పత్రికి రావాలని కోరడం విశేషం.ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది.గతంలో తమ పార్టీ నేత కామినేని శ్రీనివాస్ ఆరోగ్య మంత్రిగా ఉన్నారని, ఇప్పుడు ముఖ్యమంత్రి వద్దే ఆ శాఖ ఉందని ఆయన అన్నారు.ఇప్పుడు అయినా మార్పు రావాలి. ఇప్పుడున్న జనాభాకు వెయ్యి పడకలు సరిపోవడం లేదు. సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగారు తరచూ విశాఖపట్టణం వస్తున్నారు. అది మంచిదే. ఒకసారి ఆయన కేజీహెచ్‌ను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది వరకు మా మంత్రిగారు కేజీహెచ్‌లో రాత్రి బస చేశారు. నేను వద్దని చెప్పినా ఆయన వినలేదు. తర్వాత ఆయన పోస్టు పోయింది. అక్కడ ఏదో సెంటిమెంట్ ఉందట. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగారు పడుకోవాల్సిన అవసరం లేదు.. విజిట్ చేస్తే చాలు అని ఆయన వ్యాఖ్యానించారు. కెజిహెచ్ బాగుపడుతుందని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు.

tags : vishnukumar raju, kg hospital

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info