A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపికి అన్యాయం చేసిన పార్టీతో టిడిపి జత
Share |
September 22 2018, 3:11 am

ఆంధ్రప్రదేశ్‌కు ఏ పార్టీ అన్యాయం చేసిందో, అదే కాంగ్రెస్‌ పార్టీతో టీడీపీ జతకట్టిందని రాజ్యసభ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. త్వరలోనే ప్రజలు బుద్ధిచెబుతారని వ్యాఖ్యానించారు. ఏపీ శాసనసభ రాజ్యాంగ విరుద్ధమైన సభ అని సాక్షాత్తూ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్న విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు తాము ఎందుకు హాజరు కావడం లేదో బహిరంగ లేఖ రాశామని తెలిపారు. 23 మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడి, వారిలో నలుగురిని మంత్రులుగా చేసిన ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేయండి..మర్నాడే మా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతారని చెప్పారు.

tags : vijayasai,ap, injustic

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info