A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ బస్ లు
Share |
April 21 2019, 11:36 am

హైదరాబాద్ కు వంద విద్యుత్ తో నడిచే వంద బస్ లను ఆర్టిసి ప్రవేశపెడుతోందని, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ చెప్పారు. ఇతర మున్సిపాలిటీల్లో ఈ-స్వచ్ఛ్ ఆటోలను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. బుధవారం ఇంధనశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రాతో కలిసి సచివాలయం వద్ద ఐదు ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించా రు. ఈ సందర్భంగా అరవింద్‌కుమార్ మాట్లాడుతూ నగరంలో కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందన్నారు.మొదటి విడుతలో 40 బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఐదు బస్సులను ప్రారంభిస్తున్నామన్నారు. ఇక నుంచి సాధారణ ప్రజలు ఎలాంటి శబ్ధంలేని, కాలుష్యరహిత బస్సుల్లో నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రయాణం చేయవచ్చని చెప్పారు.
ఎలక్ట్రిక్ బస్సుల ప్రత్యేకతలు..
-ఒక్కసారి చార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణం
-ఫుల్ చార్జింగ్‌కు పట్టేసమయం 4-5 గంటలు
-వైఫై, ఇంటర్నెట్ కనెక్టివిటీ, రేడియో సిస్టం
-కాలుష్య రహితం
-ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టం
-ఎల్‌ఈడీ లైటింగ్
పొడవు:12 మీటర్లు
వెడల్పు:2.5 మీటర్లు
వీల్‌బేస్;6100 మిల్లీ మీటర్లు

tags : electric buses

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info