A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి.అసెంబ్లీ రద్దుపై మద్యాహ్నం సమావేశమా?
Share |
September 26 2018, 4:19 am

తెలంగాణ శాసనసభ రద్దు పై గురువారం మద్యాహ్నం మంత్రివర్గం తీర్మానం చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. మద్యాహ్నం ఒంటిగంట,రెండు గంటల మద్య మంత్రులతో సమావేశం అయి ఈ మేరకు నిర్ణయం చేస్తారని చెబుతున్నారు.ఆ తర్వాత కెసిఆర్ మంత్రులతో కలిసి గవర్నర్ ను కలిసే అవకాశం ఉంంది.అసెంబ్లీ రద్దు తీర్మానం ఆమోదం తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్‌ కోరనున్నారు. అనంతరం కేసీఆర్‌ మంత్రివర్గ సహచరులతో కలిసి నేరుగా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకొని మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు. తొమ్మిది నెలల గడువున్నా అసెంబ్లీని ఎందుకు ముందస్తుగా రద్దు చేయాల్సి వచ్చిందో వివరిస్తారు. మర్నాడు శుక్రవారం హుస్నాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం నుంచి టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు లాంఛనంగా ప్రకటిస్తారు. అయితే ఇంతవరకు అదికారికంగా ప్రకటించకపోవడం విశేషం. వార్తలు కాని, పరిణామాలు కాని ఇలా ఉన్నాయి.

tags : t.assembly, disolve

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info