A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈనాడులో వస్తేనే చంద్రబాబు స్పందిస్తారా
Share |
September 22 2018, 2:50 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనాడులో వార్త వస్తే కాని స్పందించరా?గత కొన్ని నెలలుగా ప్రతిపక్ష నేత జగన్ గాని, ఇతరులు కాని 108 సర్వీసలు సరిగా పనిచేయడం లేదని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పలు సందర్భాలలో చెప్పినా ముఖ్యమంత్రి ఈనాడులో వార్త వచ్చిన తర్వాత సమీక్ష జరిపారట.ఆ పత్రికలో వచ్చిన కధనం ప్రకారం సేవలు మెరుగుపరుచుకోకుంటే 108 అంబులెన్సు సర్వీసుల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించేందుకు వెనుకాడబోనని బీవీజీ ఇండియా లిమిటెడ్‌ కన్సార్టియం సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అవసరమైనచోట కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. 108 సేవలపట్ల ప్రజల్లో సంతృప్తి వచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ‘ఈనాడు’లో సోమవారం ప్రచురితమైన ‘108కి సుస్తీ’ వార్తపై ఆయన మంగళవారం ఉండవల్లిలో సమీక్ష నిర్వహించారు. డెంగీ, మలేరియా జ్వరాలపై కొత్తగా కేసులు నమోదైతే చర్యలు తప్పవనీ సీఎం పేర్కొన్నారు. విశాఖలో జ్వరాల ఉద్ధృతికి మూల కారణాలను అన్వేషించాలని సూచించారు.

tags : chandrababu, eenadu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info