A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీనే బెటర్ మరో ఆన్ లైన్ సర్వే ఫలితం
Share |
November 14 2018, 8:15 am

సమస్యలు ఎన్ని ఉన్నా, ఇప్పటికీ ప్రదాని నరేంద్ర మోడీనే సర్వేలలో ముందంజలో ఉన్నారు.దేశానికి నాయకత్వం వహించడానికి మోడీ నే బెటర్ నేత అని ఒక ఆన్ లైన్ సర్వే వెల్లడించింది. మోడీకి నలభై ఎనిమిది శాతం మంది మద్దతు ఇస్తే రాహుల్ గాంధీకి 11.2 శాతం మాత్రమే మద్దతు ఇచ్చారట.దాదాపు 57లక్షల మంది అధ్యయనంలో పాల్గొనగా 48 శాతం మంది మోదీకి అనుకూలంగా ఓటు వేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ 11.2 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ 9.3శాతం మంది మద్దతుతో మూడో స్థానంలో, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత అఖిలేశ్‌ యాదవ్‌ ఏడుశాతం మంది మద్దతుతో నాలుగోస్థానంలో నిలిచారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 4.2శాతం మంది మద్దతుతో ఐదో స్థానంలో, బహుజన్‌సమాజ్‌ పార్టీ అధ్యక్షురాలు మాయావతి 3.1శాతం మంది మద్దతుతో ఆరోస్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా మొత్తం 923 మంది నేతల నుంచి అధ్యయనంలో పాల్గొన్నవారు దేశ నేతను ఎంచుకోవాలని సర్వేలో కోరగా ఈ ఫలితాలు వచ్చాయి.

tags : narendra modi, better

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info