A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అన్నదమ్ములను కూడా మోసం చేసిన మంత్రి
Share |
April 21 2019, 12:03 pm

మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత అన్నదమ్ములను కూడా మోసం చేశాడని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. స్వార్ద రాజకీయాలకోసం ఆది నారాయణరెడ్డి పార్టీ మారారని ఆయన అన్నారు. తోడు–నీడగా వెన్నంటే నిలిచిన అన్నదమ్ములను మోసం చేశారు. వియ్యంకుడు కేశవరెడ్డి ఆస్తులు కాపాడుకునేందుకు వక్రబుద్ధి చూపారు. నీచమనస్తత్వం కల్గిన మంత్రికి తమ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆది నారాయణరెడ్డి భాష అద్వాన్నంగా ఉందని,నీచంగా ఉందని ఆయనఅన్నారు. మూడు మార్లు మంత్రి సోదరుడు నారాయణరెడ్డి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే, ఆయనను పక్కకు నెట్టినాలుగోమారు గెలిచే సమయంలో ఆది పోటీ చేశారన్నారు. మంత్రి ఆది అంతటి స్వార్థపరుడు లేడని ధ్వజమెత్తారు. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన బీఫాంతో గెలిచి ఆయన వెంట నడవడం తన దరిద్రమా అని నిలదీశారు. ఫ్యాన్‌ గుర్తుపై గెలిచి రూ.30కోట్లకో, రూ.40కోట్లకో అమ్ముడు పోకుండా ఆయన వెంట నడవడం దరిద్రమా అని చెప్పారు. తల్లిపాలు తాగి కామంతో చూసే నీ చూపు ఉన్నతమా అని అడిగారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన బీఫాంపై 12వేల ఓట్ల మెజారిటీతో జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే వారిని వంచించి పార్టీ మారడం దారుణమన్నారు. పదవీ వ్యామోహంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీని వదలి చంద్రబాబు మోచేతి గంజినీళ్లు తాగడం ఉన్నతమా అని అన్నారు. అధికార దాహంతో కృతజ్ఞతాహీనుడిగా మిగలావన్నారు. మంత్రి వియ్యంకుడు కేశవరెడ్డి దేశమంతా కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎగరగొడితే కుటుంబ స్వార్థం కోసం ప్రజలను గాలికొదిలేసి జగన్‌ను విమర్శించడం సరికాదని అన్నారు.

tags : rachamallu, adi,cheat

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info