A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు మాటలు-నవ్వాలో,ఏడవాలో
Share |
September 23 2018, 8:16 am

నోట్ల రద్దు సలహా ఇచ్చింది తానే చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు నోట్ల రద్దు గురించి మాట్లాడుతున్న తీరు చూసి ప్రజలకు నవ్వాలో,ఏడవాలో అర్దం కావడం లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిధి సుధాకర్ బాబు అన్నారు.చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు.. పూటకో మాట, రోజుకో అబద్ధం ఆడటం బాబు నైజమని ధ్వజమెత్తారు.
నోట్ల రద్దు సలహా కమిటీ చైర్మన్‌గా ఉన్న చంద్రబాబుకు అప్పుడు నోట్ల రద్దు తప్పు అని తెలియలేదా అని సూటిగా అడిగారు. ‘పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి అంటున్నావు. మీరు చేసిన పాపం కాదా, బీజేపీతో అంటకాగి ఇప్పుడు గగ్గోలు పెడితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జలగల్లా ప్రజల రక్తం తాగుతున్నాయి. రెండు ప్రభుత్వాలు దోపిడీ దొంగల్లా దోచుకుంటున్నాయి. పెట్రోలు, డీజిల్‌లో వస్తున్న డబ్బు అంతా ఏమైపోతుంది. ధరలు పెరిగితే తగ్గిస్తానన్నావ్‌ కదా చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు నోరుమెదపవు’ అని సూటిగా అడిగారు.

tags : ysr congress, babu,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info