A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల కు కెవిపి లేఖ
Share |
September 23 2018, 9:40 am

శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు కాంగ్రెస్ ఎమ్.పి కెవిపి రామచంద్రరావు లేఖ రాశారు.తాను ఇరవై ఎనిమిది ప్రశ్నలతో లేఖ రాస్తే , కోడెల అసత్యాలతో జవాబు ఇచ్చారని ఆయన అన్నారు.వాస్తవాలతో సంబందం లేకుండా ప్రభుత్వం చెప్పిన విషయాలనే కోడెల చెబుతున్నారని ఆయన ఆక్షేపించారు.పోలవరంపై కోడెల సమాధానం ఆయన అవగాహన రాహిత్యాన్ని తెలియజేస్తుందన్నారు. పోలవరం అంటే హెడ్‌వర్క్స్‌ మాత్రమే కాదని, ఆ విషయం కోడెల తెలుసుకోవాలని చెప్పారు. పోలవరంపై తప్పిదాలను స్పీకర్‌ సమర్ధిస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు అసత్యాలు చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నాడు.. అవసరమైతే చార్మినార్‌ కూడా తానే కట్టానని చెబుతాడని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం కాంగ్రెస్‌ అన్ని అనుమతులు ఇచ్చిందని, ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లిందీ కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఎప్పటికి పోలవరం పూర్తి అవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని ఆయన అన్నారు.

tags : kvp, letter, kodela

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info