A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ పనిచేస్తే అసెంబ్లీకి వస్తాం- వైఎస్సార్పి
Share |
November 18 2018, 9:04 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే అసెంబ్లీకి హాజరవుతామని ఆ పార్టీ ప్రకటించింది. పిరాయింపుదారులపై చర్య తీసుకోనందుకు గాను వైసిసి ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కాని విషయం తెలిసిందే.పిరాయింపు దారులపై వేటు వేయవలసిందేనని మాచర్ల ఎమ్మెల్యే, పార్టీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.తమ పార్టీ లెమ్మెల్యలను కోట్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసినా స్పీకర్ చర్య తీసుకోవడం లేదని ఆయన అన్నారు. కోడెలకు ఎన్నిసార్లు పిర్యాదు చేసినా ఆయన విస్మరిస్తున్నారని రామకృష్ణారెడ్డి అన్నారు.కోడెల కూడా టిడిపి సమావేశాలలో పాల్గొంటూ విలువలకు తిలోదకాలు ఇచ్చారని ఆయన ద్వజమెత్తారు. స్పీకర్‌ స్థానాన్ని అవమానపరిచేలా కోడెల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే రేపు ఉదయాన్నే సభకు హాజరవుతామని పేర్కొన్నారు.

tags : pinnelli, ysr congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info