A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు అన్నిసార్లు మోసం చేయలేరు
Share |
November 14 2018, 10:03 am

ప్రజలకు నిజాలు ఎప్పటికైనా తెలుస్తాయని ,అన్నిసార్లు ప్రజలను మోసం చేయడం సాద్యం కాదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను అన్నిసార్లు మోసం చేయవచ్చని అనుకుంటారని, కాని అది సాద్యం కాదని ఆయన అన్నారు.ఆయన ఒక ట్వీట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘మీరు అన్ని వేళల్లోనూ కొంతమందిని మోసం చేయవచ్చు. మీరు అందరినీ ఒకసారి మోసం చేయవచ్చు. అయితే ప్రజలందరినీ అన్నిసార్లూ మోసం చేయలేరు. ప్రజలకు నిజం ఏమిటో తెలిసిపోతుంది.. చంద్రబాబు అంటే విద్రోహి, అంతులేని అవినీతిపరుడు, అత్యంత అసమర్థుడు, అబద్ధపు హామీలకు చిరునామా, యూటర్న్‌లు తీసుకోవడంలో మాస్టర్, వెన్నుపోటుదారుడు, నిరుపేదల బద్ధ వ్యతిరేకి, మైనారిటీలకు వ్యతిరేకి, రైతుల వ్యతిరేకి’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను జత చేశారు.

tags : vijayasaireddy, chandrababu, cheating

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info