A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ జాతకం ప్రకారమే నిర్ణయం
Share |
September 26 2018, 5:00 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జాతకం ప్రకారమే అసెంబ్లీ రద్దుతీర్మానం జరగబోతోందని వార్తలు వస్తున్నాయి.గురువారం ఉదయం మంత్రివర్గం సమావేశం అయి అసెంబ్లీ రద్దు చేయాలని సిఫారస్ చేస్తూ తీర్మానం చేయవచ్చని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతకం ప్రకారం గురువారం ఉదయం 6 గంటల నుంచి 7 వరకు కీలక నిర్ణయాలకు అత్యంత అనుకూల సమయమని, ఆయన నక్షత్ర, రాశులకు అనుకూలంగా గ్రహస్థితులు ఆ రోజు ఉన్నాయని, అందుకే ఆ సమయాన కేబినెట్‌ భేటీకి సీఎం సిద్ధమైనట్లు తెలియవచ్చింది. మరోవైపు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మెరుపు వ్యూహంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నారు. లక్షలాది మందితో ప్రగతి నివేదన సభ నిర్వహించి 48 గంటలు కూడా దాటకముందే హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. అన్నీ అనుకున్నట్లు గురువారం శాసనసభ రద్దు ప్రకటన వెలువడితే ముఖ్యమంత్రి శుక్రవారం హుస్నాబాద్‌ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పోలీసుశాఖ సైతం ముందస్తు ఎన్నికలకు అవసరమయ్యే బలగాల కోసం కసరత్తు మొదలుపెట్టింది.

tags : kcr, astrology

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info