A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ ను తిట్టాం కదా..టిడిపి ఎమ్.పి డౌట్
Share |
November 14 2018, 10:03 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో పొత్తు గురించి మంత్రులు, ఎమ్.పిల భేటీలో చర్చించిన సందర్భంగా కొందరు తమ సందేహాలను వ్యక్తం చేశారట. టిడిపి మీడియా వాటిని బయటకు రాకుండా జాగ్రత్తపడుతుండడం విశేషం.రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందంటూ ఇన్నాళ్లూ మనం తిట్టిపోసిన పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలకు ఎలా సమాధానం చెబుతామని ఉత్తరాంధ్రకు చెందిన ఒక ముఖ్య నాయకుడు ప్రశ్నించగా, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, సమయానుకూలంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని చంద్రబాబు చెప్పారని మరో మీడియాలో కదనం వచ్చింది. ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతుండడం వల్లే కాంగ్రెస్‌తో కలుస్తున్నట్లు చెప్పవచ్చని, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ప్రత్యేక హోదా ప్రకటన మళ్లీ చేయించవచ్చని చంద్రబాబు అన్నారట. బీజేపీతో విడిపోయాం కాబట్టి కాంగ్రెస్‌తో కలిసి నడవాల్సిందేనని, ప్రజలకు ఏంచెప్పాలో తాను చెబుతానని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని, పైగా ఆ పార్టీ కొద్దిరోజుల క్రితం మనపై ఛార్జిషీట్‌ విడుదల చేసిందని అలాంటప్పుడు వారితో కలిసి ఎలా వెళ్లగలమని ఒక నేత ప్రశ్నించగా, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలేనని చంద్రబాబు బదులిచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్‌పై రాష్ట్రంలో వ్యతిరేకత ఉందని, ఆ పార్టీకి ఎన్ని ఓట్లు ఉన్నాయని ఒకరిద్దరు అనుమానం వ్యక్తం చేసినా బీజేపీ గ్రాఫ్‌ తగ్గి, కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరిగిందని, కాంగ్రెస్‌తో పొత్తు ద్వారానే రాష్ట్రానికి లాభమంటూ అనుకూల మీడియా ద్వారా ఉధృతంగా ప్రచారం చేద్దామని, అవన్నీ తాను చూసుకుంటానని సీఎం వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుపై త్వరలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారట.

tags : tdp, doubt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info