A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
త్రిబుట్ బెడ్ రూమ్ ఇంటిలోనే ప్రదాని
Share |
April 21 2019, 12:09 pm

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లుగానే మూడు బెడ్ రూమ్ ల ఇంటికి మారారు.ఆయన దేశ ప్రజల డబ్బును వృదా చేయరాదని, అందువల్ల పొదుపుగా ఉంటానని గతంలో ప్రకటించారు. ప్రదాని కి ఇచ్చే సువిశాలమైన బంగళాను తాను వినియోగించబోనని ఆయన చెప్పారు. తదనుగుణంగానే ఆయన ఆ బంగ్లాలో దిగలేదు. అక్కడ 524 మంది పనిచేస్తుంటారు.కాని ఇమ్రాన్ ఖాన్ కేవలం ఇద్దరు సేవకులతో కలిసి మిలటరీ సెక్రటరీ కి చెందిన ఇంటికి మారారు. ఆయన సొంత ఇంటిలో ఉండాలని అనుకున్నారు కాని, భద్రతా సిబ్బంది అంగీకరించలేదు. ప్రాణానికి ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.దాంతో ఆయన ఈ ఇంటికి మారారు.తన ఇంటికి ఆదివారాలు వెళతానని చెప్పారు.కాగా ప్రదాని బంగ్లాను పరిశోధన కేంద్రంగా మార్చాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

tags : pakistan,pm three bed room house

Latest News
*శ్రీలంకలో ఉగ్రవాదుల దాడి-25 మంది మృతి
*వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
*నా భర్తను చంపేందుకు కుట్ర- మాజీ సి.ఎమ్
*అప్పు చేసి మరీ ఓట్ల కొనుగోలు స్కీములకు..
*యుద్దం సినిమాలు- హీరోకి బిజెపి టిక్కెట్
*ఇది సోమిరెడ్డి జోస్యం
*హైదరాబాద్ కు క్యూ కట్టిన సింగపూర్ కంపెనీలు
*జగన్ నేమ్ ప్లేట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్య
*సి.ఎమ్.సేవలు దేశానికి అవసరం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info