A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రభుత్వ వైఫల్యమే రాజదానికి వరదలు
Share |
September 26 2018, 4:41 am

రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ వైఫల్యం వల్లే వరదల ప్రభావాన్ని ప్రజలు అనుభవించవలసి వస్తున్నదని రాజదాని ప్రాంత సిపిఎం కన్వీనర్ సి.హెచ్ బాబూరావు అన్నారు. విజయవాడ నగరంలో ఐదు వేల ఇళ్లు వరదల వల్ల ముంపునకు గురయ్యాయని ఆయన చెప్పారు.ప్రభుత్వం 461 కోట్ల రూపాయల వ్యయంతో డ్రైనేజీ నిర్మిస్తున్నామని చెబుతోందని,మరి అలాంటప్పుడు ఈ పరిస్తితి ఎందుకు ఏర్పడిందని ఆయన ప్రశ్నించారు.అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులు పొంగుతున్నాయని, సెక్రటేరియట్‌లోని మంత్రుల కార్యాలయాలు కూడా వర్షం ప్రభావానికి గురయ్యాయని , అలాగే రాజధానిలో అనేక గ్రామాలు ముంపు బారిన పడ్డాయని, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. 60 మిల్లీమీటర్ల వర్షపాతానికే విజయవాడ నగరం ముంపునకు గురవుతోందని వ్యాఖ్యానించారు. 150 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన వర్షపు నీటి కాలువలను కుదించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.

tags : baburao, capital, floods

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info