A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ సవాల్ స్వీకరిస్తారా
Share |
January 16 2019, 4:57 am

పల్నాడులో జరుగుతున్న అక్రమ మైనింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల ప్రమేయం ఉందని మాజీ మంత్రి,వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు.అక్రమ మైనింగ్‌పై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విసిరిన సవాలును దమ్ముంటే ప్రభుత్వం స్వీకరించాలని ఆయన అన్నారు. చంద్రబాబుకు చిత్త శుద్ది ఉంటే గుంటురు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని సవాలు చేశారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు గనుల దోపిడిపై అసలు సూత్రధారులను కాపాడుతూ అధికారులకు నోటీసులివ్వడం సిగ్గుచేటని విమర్శించారు.

tags : jagan, challenge

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info