A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
Share |
September 26 2018, 4:33 am

కేరళలోని లక్షలాది మంది నిర్వాసితులలో సుప్రింకోర్టు జడ్జి కురియన్ జోసెఫ్ కుటంబం కూడా ఉంది. ఆయన సోదరుడు, సోదరి ఇళ్లు కూడా వరద నీటిలో మునిగిపోయాయి.వారిది కోచ్చి సమీపంలోని కలాడీ అనే పట్టణం. కోచి విమానాశ్రయం కూడా వరద నీటితో నిండిపోయిన సంగతి తెలిసిందే.కలాడి పట్టణం అంతా మునిగిపోవడంతో అంతా సహాయ శిబిరాలకు తరలి వెళ్లవలసి వచ్చింది. జడ్జి తన సోదరుడు, సోదరిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించినా సాద్యం కాలేదు. పోన్ సిగ్నల్స్ అందని పరిస్తితి ఏర్పడింది.కాగా కేరళ వరదబాదితులను ఆదుకునేందుకు సుప్రింకోర్టు న్యాయవాదులు కూడా ముందుకు వచ్చారు. సొలిసిటర్ జనరల్ వేణుగోపాల్ కోటి రూపాయల విరాళం ప్రకటిస్తే, ఆయన కుమారుడు కృష్ణన్ పదిహేను లక్షల విరాళం ఇచ్చారు. అలాగే పలువురు న్యాయవాదులు కూడా విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

tags : kerala, judge floods

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info