A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ పై చంద్రబాబు లీకులు
Share |
September 23 2018, 10:32 am

ఎపి ముఖ్యమంత్రి ,తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు క్రమంగా కాంగ్రెస్ వైపు కదులుతూ, పార్టీ నేతలను కూడా అందుకు సిద్దం చేస్తున్నారు.అంతేకాక,పార్టీ నేతలంతా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని కోరుతున్నట్లుగా లీక్ లు ఇప్పించడం ఆరంభించారు. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానంటున్నదని, అందువల్ల ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చని టిడిపి నేతలు ముఖ్యమంత్రి తో జరిపిన సమావేశంలో భావించినట్లు టిడిపి మీడియాలో లీక్ ఇచ్చారు. గతంలో రాహుల్ గాందీ ప్రత్యేక హోదాపై మీటింగ్ పెడితే టిడిపి నేతలు తీవ్ర నిరసన తెలిపిన పరిస్తితి నుంచి ఇప్పుడు రాహుల్ గాందీ హైదరాబాద్ లో మీటింగ్ పెడితే స్వయంగా ముఖ్యమంత్రి కోడలే ఆ సమావేశానికి వెళ్లే పరిస్థితి ఏర్పడడం విశేషం. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకే అవకాశం ఉందన్న భావనను నేతలు చంద్రబాబు వద్ద వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత తగ్గిందని నేతలు సీఎంకు వివరించారని లీక్ ఇచ్చారు. కొద్ది నెలల క్రితం వరకు రాహుల్ ను ఎపికి రాకుండా తరిమికొట్టాలన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వ్యతిరేకత తగ్గిందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో భాజపా ప్రాభవం రోజు రోజుకూ తగ్గుతోందని నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కళా వెంకట్రావు, లోకేశ్‌, అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు, సుజయకృష్ణ రంగారావు, కాల్వ శ్రీనివాసులు ప్రభృతులు పాల్గొన్నారు.

tags : ap, congress, chandrababu,leaks

Latest News
*రాఫెల్ డీల్- ఖండించిన ప్రాన్స్
*4 ఏళ్లు మోడీకి చంద్రబాబు ఊడిగం చేసినట్లా
*శివాజీ గొడవ ఏమిటో అర్దమే కాదు
*పురుగులు పడి చస్తారన్న మధుయాష్కి
*60 సీట్లలో బిసి అభ్యర్దులు- బిఎల్ ఎఫ్
*ఉత్తం బార్య సీటుకే టిడిపి ఎసరు!
*ఎపికి నూక్లియర్ పవర్ ప్లాంట్
*చైర్మన్ పదవి ఎందుకంటే- కోదండరామ్
*కాంగ్రెస్ ఎమ్.పిల మూకుమ్మడి రాజీనామా యోచన
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info