A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీకి-రాహుల్ కు చాలా తేడా-సర్వే
Share |
January 16 2019, 4:47 am

ప్రజాదరణలో ప్రధాని నరేంద్ర మోడీతో ఎఐసిసి అదినేత రాహుల్ గాందీ ఇంకా పోటీ పడలేకపోతున్నారు. వారిద్దరి మధ్య సర్వేలలో చాలా తేడా వస్తోంది.వచ్చేసారి కూడా మోడీనే ప్రదాని అని ఎక్కువ మంది బావిస్తున్నారని కదనం.తదుపరి ప్రధానిగా మోదీకి ప్రజాదరణ 49 శాతం కాగా, రాహుల్‌ గాంధీకి ప్రజాదరణ 27 శాతంగా ఉంది. ప్రధాని రేస్‌లో నిలిచిన వీరిద్దరిలో మోదీవైపే ప్రజలు విస్పష్టంగా మొగ్గుచూపగా ప్రియాంక గాంధీవైపు మూడు శాతం మంది మొగ్గుచూపారు. బిజెపి సొంతంగా గెలుచుకోలేకపోయినా, ఎన్.డి.ఎ అదికారంలోకి వస్తుందని ఈ సర్వే తెలిపింది.అదే సమయంలో మోడీ ప్రజాదరణ ఎన్.డి.ఎ. గెలుపుకు ఉపయోగపడుతుందని సర్వే అబిప్రాయపడింది.అయితే మోదీకి ప్రత్యామ్నాయం రాహుల్‌ గాంధీయేనని ఈ సర్వే తేల్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నేతగా రాహుల్‌ మెరుగైన ఎంపికని 46 శాతం మంది తేల్చిచెప్పారు. మోదీకి బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రత్యామ్నాయమని సర్వేలో పాల్గొన్న వారిలో 8 శాతం మంది అభిప్రాయపడ్డారు.

tags : modi, survey

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info