A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ మరో రెండు మర్చిపోయారేమో
Share |
November 18 2018, 10:43 pm

విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ లెక్కలు తప్పుచెప్పినట్లుగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలోని తెలుగుదేశం పార్టీ చేసుకున్న పెళ్లిళ్ల గురించి ఆయన మాట్లాడుతూ ఐదు పెళ్లిళ్లు అన్నారు.*చంద్రబాబు నాయుడు ఇప్పటి దాకా బీజేపీ సహా ఐదు పార్టీలతో పెళ్లిళ్లు చేసుకుని కాపురం చేయడం, విడాకులు ఇవ్వడం కూడా అయిపోయింది. తాజాగా కాంగ్రెస్‌ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయారు. కాంగ్రెస్‌ను శాశ్వతంగా బహిష్కరించినా కసి తీరదని ఏడాది క్రితం చెప్పిన ఈ పెద్దమనిషి ఇప్పుడు చేసిందేమిటి?"అని ఆయన ప్రశ్నించారు.పార్టీల పరంగా చూస్తే ఐదు పార్టీలే అయినా,ఇక్కడ ఇంకో సంగతి ఉంది.భారతీయ జనతా పార్టీ తో చంద్రబాబు రెండుసార్లు కలిసి,రెండుసార్లు విడిపోయారు.1998లో తొలిసారి యుపిఎ నుంచి జంప్ చేసి బిజెపి వద్దకు వచ్చేశారు.ఆ తర్వాత పొత్తులో 1999లో పోటీ చేశారు.2004 లో ఓడిపోయిన తర్వాత జన్మలో బిజెపితో కలవనని అన్నారు. ఆ తర్వాత 2014 లో మళ్లీ పొత్తు పెట్టుకుని పోటీచేశారు.అలాగే 1996 లోక్ సభ ఎన్నికలలో ,1998 లోక్ సభ ఎన్నికలలో సిపిఐ,సిపిఎం లతో కలిసి చంద్రబాబు పోటీచేశారు. ఆ తర్వాత ఆయన వారికి చెప్పాపెట్టకుండా బిజెపి గూటిలో చేరారు. ఆ తర్వాత మళ్లీ 2009 లో మళ్లీ వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. టిఆర్ఎస్,జనసేనలతో ఒకసారే పొత్తు పెట్టుకున్నారు. 1996 లో కేంద్రంలో కాంగ్రెస్ తో సహకారంతో యునైటెడ్ ప్రంట్ ప్రభుత్వంలో భాగస్వామి అయినా,నేరుగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టలేదు.ఈ రకంగా చూస్తే మొత్తం చంద్రబాబు నాయుడు ఏడు సార్లు రాజకీయ వివామం చేసుకున్నట్లు లెక్క.జగన్ ఈ విషయం మర్చిపోయి ఉండవచ్చు.

tags : jagan, tdp, alliance

Latest News
*బాబూ మోహన్ కు నచ్చలేదు
*కెటిఆర్ సవాల్ ను స్వీకరిస్తా -షబ్బీర్
*పవన్ కళ్యాణ్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫైర్
*పరుగు తీసి నామినేషన్ వేసిన సిపిఐ రిబెల్
*విద్యార్ధినులకు స్కూటీలు- బిజెపి హామీ
*చంద్రబాబు రాజకీయ క్రీడ-ntr కుటుంబం ఓ పావు
*కెసిఆర్ ను జైలులో పెడతారట
*టిడిపి ముఖ్యనేతలకే సీట్లు లేవు
*హాయ్ లాండ్ పై చంద్రబాబు కొత్త డ్రామా
*ఎపి ప్రజలు ఇసుకపై టిడిపి టాక్స్ కడుతున్నారు
*పాపం కోదండరామ్..ఆయనకే సీటులేదు
*6 నెలలపాటు సిబిఐ,ఐటి ..ఏవీ పనిచేయకూడదట
*జగన్ కేసు- ఆ చొక్కాను కోర్టుకు ఇవ్వండి
*పవన్ కళ్యాణ్ టిడిపి ఎపి అద్యక్షుడి ప్రశ్నలు
*కాంగ్రెస్ కు మరో మాజీ మంత్రి గుడ్ బై
*మల్లయ్య యాదవ్ కు కోదాడ trs టిక్కెట్
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి శంకరరావు గుడ్ బై
*ఇదేం బాలకృష్ణ అండి బాబూ!
*అగ్రిగోల్డ్ బాదితులను నిలువునా ముంచేశారు
*టిడిపికి తెలంగాణలో ముఖం లేకుండా పోయింది
*అయ్యా రాహుల్ అబద్దం చెప్పినా అతికేలా ..
*గుండెకోత- ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి
*స్పెషల్ ఫ్లైట్ లలో తిరిగే చంద్రబాబుకు..
*మోడీకి కాంగ్రెస్ సమాదానం
*జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేకే
*మళ్లీ యజ్ఞం చేయనున్న కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info