A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
Share |
September 26 2018, 5:03 am

మంత్రి నారా లోకేష్ కరెక్టుగానే చెప్పారు. ఆయన 2 వేల రూపాయల నోట్లు రద్దు చేయాలని అన్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఏ ఉద్దేశంతో ఆ మాట చెప్పినా అది అవసరమే. 500 రూపాయల నోట్లు మించి ఉండరాదన్నది తమ అభిప్రాయమని ఆయన అన్నారు.నోట్ల రద్దుకు తమ అదినేత చంద్రబాబు పోరాడాదరని ఆయన చెప్పారు. గతంలో వెయ్యి,500 నోట్లు రద్దు చేయాలని కోరామని ఆయన అన్నారు. సచివాలయంలో ఐసిఐసిఐ బ్యాంకు శాఖను ప్రారంబించిన సందర్భంగా లోకేష్ ఈ మాట చెప్పారు. రెండువేల నోట్లు వచ్చాక, ఓట్ల రేటు రెండువేలకు పెరిగింది.నంద్యాల ఉప ఎన్నికలో టిడిపినే అత్యదికంగా 2 వేల నోట్లను నల్లదనం రూపంలో పంచిందన్న విమర్శలు వచ్చాయి.అయినా లోకేష్ ఈ మాట కు కట్టుబడి ఉంటే మంచిదే.

tags : lokesh, demonitisation

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info