A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
Share |
September 22 2018, 7:34 am

ఈ మద్య అమరావతి బాండ్ల పేరుతో రెండువేల కోట్ల రూపాయలు వసూలు అవడంపై ఎల్లో మీడియా అహా చంద్రబాబు, ఓహో చంద్రబాబు అని పొగడడం చిత్రంగా ఉందని విపక్ష నేత జగన్ విమర్శించారు. ఈ బాండ్లను 10.32 శాతం జారీ చేశారని, తెలంగాణలో హైదరాబాద్ కార్పొరేషన్ 8.9 శాతం వడ్డీకి బాండ్లు తెచ్చాయని, అలాగే పుణే కార్పొరేషన్ తక్కువ వడ్డీకి రుణాలు తెచ్చుకుందని ఆయన అన్నారు. ఈ బాండ్ల కు పదిహేడు కోట్ల రూపాయల కమిష్ ఇచ్చారని,అందులో పది కోట్లు లంచాలుగా చంద్రబాబు తీసుకున్నారని ఆయన అన్నారు.రాజదాని నిర్మాణ భాద్యత కేంద్ర ప్రభుత్వానిది కాదా అని ఆయన అన్నారు. కేంద్రం కట్టవలసిన దానిని అదిక వడ్డీకి అప్పులు తీసుకు వచ్చి కట్టడం ధర్మమేనా అని ఆయన ప్రశ్నించారు.రాజదాని భూముల కుంభకోణం పెద్ద ఎత్తున జరుగుతోందని ఆయన అన్నారు.రాజధాని పేరుతో అవినీతి ఏ స్థాయి లో ఉందంటే తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి చదరపు అడుగుకు పదివేల రూపాయలు ఖర్చు చేశారని ఆయన అన్నారు. లంచాలు మేయడంలో చంద్రబాబు ఆరితేరారని, ఆ సచివాలయంలో వర్షం కురుస్తోందని అన్నారు. బయట మూడు సెంటిమీటర్ల వర్షం పడితే,లోపల ఆరు సెంటిమీటర్ల నీరు లీక్ అవుతోందని ఆయన అన్నారు.

tags : jagan, amaravati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info