A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
Share |
November 14 2018, 8:05 am

బ్రిటిష్ వారి పాలనకు,చంద్రబాబు పాలనకు తేడా ఏమీ లేదని విపక్ష నేత జగన్ విమర్శించారు.బ్రిటిష్ వారు ప్రజల మద్య,కులాల మద్య ఎలా విబేధాలు పెట్టారో, చంద్రబాబు కూడా అలాగే చేస్తున్నారని ఆయన అన్నారు.ఎపిలో పోలీసు రాజ్యం నడుస్తోందని అన్నారు. గనుల అక్రమ మైనింగ్ దోపిడీలో చంద్రబాబే డాన్ గా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.చంద్రబాబు పాలనలో మహిళలకు భద్రత లేదని ఆయన అన్నారు.కరెంటు చార్జీలు, ఆర్టిసి చార్జీలు, ఇంటి పన్నులు అన్నీ బాదుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలో అదనంగా లీటర్ కు నాలుగు రూపాయలు చొప్పున లోకేష్ పాకెట్ మనీగా వసూలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

tags : jagan, babu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info