A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇది లోకేష్ టెక్నాలజీనా
Share |
September 22 2018, 2:56 am

అమరావతి లోని తాత్కాలిక సచివాలయానికి ఉద్యోగులు, అదికారులు వెళ్లడానికి భయపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే విజయవాడ వైసిపి అద్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరించే లేటెస్ట్ టెక్నాలజీ ఇదేనా అని ఆయన ఎద్దేవ చేశారు.. గతంలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఛాంబర్‌లో నీళ్లు లీక్‌ అయితే నానా మాటలు అన్నారని.. కానీ ఇప్పుడు మంత్రుల ఛాంబర్లలో అదే పరిస్ధితి నెలకొందన్నారు. సచివాలయాన్ని మంత్రి లోకేశ్‌ టెక్నాలజీతో నిర్మించారని ఎద్దేవా చేశారు. మంత్రులు, అధికారులు సచివాలయంలోకి వెళ్లడానికి భయపడుతున్నారని అన్నారు. కేరళ తరహా వరద వస్తే సచివాలయం కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.

tags : srinivas, secretariat

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info