A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రముఖుల అంత్యక్రియలు- ఒక విశ్లేషన
Share |
July 20 2019, 2:23 am

భారతదేశంలో వ్యక్తి ఆరాదన ఎక్కువే. మిగిలిన దేశాలలో ఉండదని కాదు. కాని మన దేశంలో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఇది కనిపిస్తుంటుంది. ప్రతిదానికి ఓట్లకు లింక్ ఉంటుంది. ఓట్లతో సంబందం లేకపోతే ఆ విషయాలే గమనంలోకి రావు.తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి , డి.ఎమ్.కె. అదినేత కరుణానిది పరమపదించిన తర్వాత జరిగిన విషయాలు చూడండి.అంతకుముందు అన్నా డి.ఎమ్.కె. అదినేత్రి జయలలిత స్వర్గస్తురాలైన తర్వాత ఏమి జరిగిందో చూశాం. ఆమెకు మెరీనా బీచ్ లో అంత్యక్రియలు జరిగాయి .మెరీనా బీచ్ లో ఆమె అంత్యక్రియలపై కొందరు కోర్టుకు వెళ్లారు. అది కరెక్టు కాదని వాదించారు. ఇప్పుడు కురువృద్దుడు కరుణానిది మరణించడంతో అక్కడే అన్నాదురై సమాది పక్కన కరుణానిది అంత్యక్రియలు జరగాలని డి.ఎమ్.కె.పట్టుబడుతూ కోర్టుకు వెళ్లింది.ప్రభుత్వం వేరే చోట రెండు ఎకరాల స్థలం కేటాయిస్తామని అన్నా డి.ఎమ్.కె. ఒప్పుకోలేదు. కోర్టు ఏమి చెప్పిందన్నది ఇక్కడ ప్రదానం కాదు. నిజమే గొప్ప నేతలకు గొప్పగా స్మారకాలు నిర్మించుకోవడం తప్పు కాదు. అయితే ఎన్నికల రాజకీయాలకు,అంత్యక్రియలు, స్మారకాలకు లింకు పెట్టి రాజకీయ పార్టీలు వ్యవహరించడం వల్ల చిక్కులు వస్తున్నాయి. ఆ మాటకు వస్తే గతంలో ఆయా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా పనిచేసి మరణించినవారికి గాని, దేశానికి ప్రధానమంత్రిగా సేవలిందించి మరణించినవారి విషయంలో కాని ఏమి జరిగిందో తెలుసుకోవడం అసందర్భం కాదు.మాజీ ప్రదాని పివి నరసింహారావుకు డిల్లీలో ఒక స్మారకం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను ఆయన ప్రాంతినిద్యం వహించిన కాంగ్రెస్ పార్టీనే పట్టించుకోలేదుపైగా ఆయన బౌతిక కాయాన్ని ఎఐసిసి ఆఫీస్ లో కూడా ఉంచడానికి సిద్దపడలేదు.ఆయన బౌతిక కాయానికి హైదరాబాద్ లో హు్స్సేన్ సాగర్ ఒడ్డున అంత్యక్రియలు చేశారు. అప్పడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సహకారం అందించింది.మరో మాజీ ప్రదాని మొరార్జీ దేశాయ్ అంత్యక్రియలు కూడా అంత గుర్తింపు లేకుండానే జరిగిపోయాయి.కొందరు మాజీ ప్రధానులు చనిపోయినప్పుడు మాత్రం డిల్లీలో పెద్ద ఎత్తున స్థలాలు కేటాయించారు. ఇక ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిలో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవి కూడా నిర్వహించారు.అయినా ఆయన అంత్యక్రియల విషయం ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఆయన అంత్యక్రియలు బెంగుళూరులో సాదాగా జరిగిపోయాయి. అలాగే కాసు బ్రహ్మానందరెడ్డి,అంజయ్య వంటివారి అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరిగాయి.జలగం వెంగళరావు అంత్యక్రియ హైదరాబాద్ శివారులోని ఆయన పామ్ హౌస్ లో జరిగాయి.కోట్ల విజయభాస్కరరెడ్డి అంతక్రియలు కర్నూలులో తుంగభద్ర ఒడ్డున జరిగాయి.మర్రి చెన్నారెడ్డికి మాత్రం ఇందిరా పార్కులో స్థలం కేటాయించారు.వైఎస్ రాజశేఖరరెడ్డి బౌతిక కాయానికి లాల్ బహదూర్ స్టేడియలో వేలాది మంది ప్రజలు నివాళులు అర్పించిన తర్వాత ఆయన సొంత జిల్లా అయిన ఇడుపుల పాయలో అంత్యక్రియలు జరిగాయి.టిడిపి అదినేత ఎన్.టి.ఆర్. బౌతిక కాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఎల్.బి.స్టేడియంలో ఉంచింది. ఆ సమయంలో ఎన్.టి.ఆర్.సొంత పార్టీ మనుషులకు, చంద్రబాబు ఆద్వర్యంలోని టిడిపి మనుషులకు మద్య గొడవ కూడా జరిగింది.ఆ తర్వాత హుస్సేన్ సాగర్ ఒడ్డున అంత్యక్రియలు జరిగాయి.అప్పుడు కాంగ్రెస్ కు చెందిన కొందరు అక్కడ నిర్వహించడాన్ని వ్యతిరేకించారు.ఆయా నేతల పలుకుబడి, ప్రభుత్వంలో ఉన్న నేతలను బట్టి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాని,వాటికి ఒక విదానం రూపొందించలేదు.దానివల్ల కొందరు ముఖ్యమంత్రులుగా పనిచేసినా సరైన గుర్తింపు లేకుండా పోతోంది.వారిలో గొప్పవారు ఉన్నా,వారి గొప్పతనం వెలుగులోకి రావడం లేదు.అందువల్ల ముఖ్యమంత్రుల, మాజీ ముఖ్యమంత్రులు, లేదా ఒక హోదా కలిగిన వ్యక్తుల అంత్యక్రియల విషయంలో దేశ స్తాయిలో,రాష్ట్ర స్థాయిలో కొన్ని విదానాలు రూపొందించడం మంచిది.లేకుంటే వివాదాలు ఏర్పడుతున్నాయి.గొడవలు జరిగే పరిస్థితి కూడా ఏర్పడుతోంది.అది ఆ నేతల స్మృతి కి కూడా గౌరవం కాదు. అయితే నేతలకు ముఖ్యమైన చోట సమాదులు కట్టినంత మాత్రాన గౌరవం రాదని, వారు చేసే ప్రజాసంక్షేమ చర్యలను బట్టి వస్తుందని కొందరు అంటారు. అది ముఖ్యమే అయినప్పట్టికీ ఎవరి పట్ల వివక్ష లేకుండా సమభావం ఉండడం ప్రభుత్వాలకు అవసరం.

tags : vip, funerals

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info