A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్,టిడిపి- ఇద్దరిది దయనీయ స్థితేనా
Share |
February 23 2019, 12:14 pm

రాజ్యసభ ఉపాద్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో ఆంద్రప్రదేశ్ కు చెందిన రెండు ప్రధాన పార్టీల వైఖరులు ఆసక్తికరంగా ఉన్నాయి. కాంగ్రెస్ వ్యతిరేకతపై పుట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుండడం ఒక విశేష పరిణామంగా కనిపిస్తుంది.అదే సమయంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఏర్పడిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ అటు కాంగ్రెస్ కు,ఇటు బిజెపికి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం విశేషం. తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల పాటు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంది. కేంద్రంలోను, రాష్ట్రంలోను ఇరు పార్టీల వారు మంత్రులుగా కొనసాగారు. కాని రాష్ట్రంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలో టిడిపి వ్యూహాత్మకంగా బిజెపికి దూరం అయింది. ప్రత్యేక హోదా విషయంలో తాము వెనుకబడి పోతున్నామని గమనించిన తెలుగుదేశం పార్టీ యుటర్న్ తీసుకుని ప్యాకేజీ వాదనను వదలుకుని ప్రత్యేక హోదా డిమాండ్ వైపు వచ్చింది.ఈ దశలో తెలుగుదేశం ఏదో ఒక పార్టీ తో జట్టు కట్టే ప్రయత్నాలు సాగిస్తోందన్న భావన ఏర్పడింది. అందులో భాగంగా తెలంగాణలో ఏకంగా కాంగ్రెస్ తో నేరుగా పొత్తు పెట్టుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి చంద్రబాబు వెనుకా ముందు అవుతున్నారు. కాని అదే సమయంలో కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో , ఆ పార్టీ ముఖ్యులతో సన్నిహితం అవడానికి చేసిన యత్నాలు బహిరంగంగానే కనిపిస్తున్నాయి. బెంగుళూరులో కుమారస్వామి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎఐసిసి అదినేత రాహుల్ గాందీ తో చెట్టపట్టాలు వేసుకున్న వైనం అందరి దృష్టిలో పడింది.అలాగే అవిశ్వాస తీర్మానం విషయంలోను కాంగ్రెస్ తో కలిసి పనిచేశారు. రాహుల్ గాందీ కూడా తెలుగుదేశం ఎమ్.పిలకు సంఘీభావం చెప్పారు.అదే ప్రకారం ఇప్పుడు రాజ్యసభ ఉపాద్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ కు తెలుగుదేశం పార్టీ అదికారికంగా మద్దతు ఇచ్చింది. నిజంగానే నిజమైన తెలుగుదేశం అభిమానులకు,తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పరిణామాలు చూస్తున్నవారికి ఆవేదన కలిగించేదే.ఇక్కడ మరో సంగతి కూడా గుర్తించాలి. రాజ్యసభ ఉపాద్యక్ష ఎన్నిక తర్వాత టిడిపి నేతలు,మంత్రులు ఎవరూ తాము కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామని దైర్యంగా బహిరంగంగా చెప్పలేకపోయారు. ఎందుకంటే టిడిపివారు.ఆ పార్టీ అదినేత చంద్రబాబు కాంగ్రెస్ ను చెత్తపార్టీ అని, సోనియాగాంధీ ఒక మాఫి యా అని పలు దూషణలకు పాల్పడ్డ వీడియోలు ఎదురుగానే ఉన్నాయి.అందుకే కాంగ్రెస్ విషయం చెప్పకుండా వైసిపి సమదూరం విదానం పాటించడాన్ని ఆక్షేపించే యత్నం చేశారు. ఇక వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయం చూద్దాం. ఈ పార్టీ అదినేత జగన్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత ధైర్యంగా సొంత పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్ తో రాజీలేని పోరాటం చేస్తున్నారు.అంతేకాదు..ఆ రోజులలో అత్యంత శక్తిమంతంగాఉన్న సోనియాగాంధీని సైతం ఎదిరించి జైలుకు వెళ్లడానికి అయినా సిద్దపడ్డారు తప్ప రాజీకి అంగీకరించలేదు.ఆ ధైర్యమే ప్రజలలో విశేషమైన గుర్తింపు తెచ్చింది సోనియాగాందీ ,చంద్రబాబులు కలిసి జగన్ పై తప్పుడు కేసులు పెట్టించారన్న అభిప్రాయం ఏర్పడింది.అలాగే భారతీయ జనతా పార్టీ కోరినా ఎన్నికల ముందు పొత్తుకు జగన్ ఒప్పుకోలేదు. ఒంటరిగానే పోరాడారు. ఇప్పుడు రాజ్యసభ ఉపాద్యక్ష ఎన్నికలలో కూడా రెండు పార్టీలకు సమాన దూరంగా ఉన్నట్లు ఆ పార్టీ ఎమ్.పి విజయసాయిరెడ్డి ప్రకటించారు.అయితే ఈ విషయంలో విజయసాయి ముందుగా చేసిన ప్రకటనకు, ఇప్పుడు ప్రకటనకు కొద్దిగా తేడా ఉంది.ఆయన ఆ అవకాశం ఇచ్చి ఉండాల్సింది కాదు. ఎన్.డి.ఎ.కి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పడం కన్నా, బిజెపి,కాంగ్రెస్ లకు ఓటు వేయబోమని చెప్పి ఉండాల్సింది.అలాకాకుండా ఎన్.డి.ఎ. వ్యతిరేకంగా ఓటు వేస్తామని అనడంతో కాంగ్రెస్ కు ఓటు వేస్తున్నారన్న అబిప్రాయం వచ్చింది.దానిని ఇప్పుడు క్లియర్ చేస్తూ రెండు పార్టీలకు ఓటు వేయడం లేదని స్పష్టం చేశారు.ఈ వైఖరి సరైనదే అనిపిస్తుంది. రాజకీయాలలో ఎలాంటి మార్పులు వస్తాయనడానికి ఈ ఎన్నిక కూడా ఒక ఉదాహరణ అవుతుంది. ఈ ఎన్నిక ఆదారంగా కాంగ్రెస్,టిడిపిలు కలిసి పనిచేస్తాయన్నదానికి ఎక్కువ ప్రాతిపదిక ఏర్పడింది.అంతకుముందు కాంగ్రెస్ ను, సోనియాగాందీని అనేక దూషణలు చేసినచంద్రబాబు ఇప్పుడు రాజకీయ అవసరాలకోసం ఆ పార్టీకి మద్దతు ఇచ్చే స్థితికి తెలుగుదేశం పార్టీని తెచ్చారు. దీనిని రాజకీయ వ్యభిచారం అని విజయసాయి విమర్శిస్తున్నారు. అయితే తమది రాజకీయ వ్యూహం అని తెలుగుదేశం వాదిస్తుంది.ఏది ఏమైనా కాంగ్రెస్ అండతో చంద్రబాబు తెలుగుదేశాన్ని నడిపించే స్థితికి తీసుకు రావడం,అలాగే టిడిపిపై ఆదారపడే పరిస్థితి కాంగ్రెస్ కు రావడం , ఆ రెండు పార్టీల దయనీయ స్థితికి అద్దం పడుతుందని చెప్పాలి

tags : parliament, tdp, congress

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info