A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ఎమ్మెల్యే ఆంజనేయులుపై ఆరోపణ
Share |
December 14 2018, 10:54 am

తనపై హత్య కేసు బనాయించడానికి వినుకొండ టిడిపి ఎమ్మెల్యే జివి ఆంజనేయులు ప్రయత్నిస్తున్నారని ,వినుకొండ నియోజకవర్గ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. నియోజకవర్గంలోని ఒక గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చే యత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రమాదానికి గురైన కారులో టిడిపి వారు ఉన్నారని,అలాగే వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు చెందిన కొందరు ఉన్నారని , ఇందులో తనకు సంబందం ఏమిటని ఆయన అన్నారు. పలు హత్య కేసులలో టిడిపి ఎమ్మెల్యే ఆంజనేయులు కు సంబందం ఉందని, అక్రమంగా స్మగ్లింగ్ చేసి వేల కోట్లు సంపాదించాడని ఆయన అన్నారు. సొంత వ్యాపార భాగస్వామినే ఆంజనేయులు హత్య చేయించారని ,ఆనాడు ఈయన ఆచూకి చెబితే రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారని ఆయన అన్నారు. హత్య రాజకీయాలు చేసిన ఆంజనేయులు వచ్చే ఎన్నికలలో ఓడిపోతానన్న భయంతో ఎలాంటి కేసుల మచ్చ లేని తనపై తప్పుడు కేసులు పెట్టించాలని యత్నిస్తున్నారని బ్రహ్మనాయుడు అన్నారు.దీనిని రాజకీయంగా ఎదుర్కుంటామని ఆయన అన్నారు.వినుకొండలో గతంలో లేని క్రిమినల్ సంస్కృతిని తీసుకు వస్తున్నారని ఆయన అన్నారు.

tags : ys congress, tdp,mla

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info