A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యూనివర్శిటీలు ఎక్కడ బాగుపడ్డాయి-బిజెపి
Share |
December 15 2018, 1:41 am

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ యూనివర్శిటీలు అద్వాన్నంగా మారిపోయాయని బిజెపి శాసనసభ పక్ష నేత జి.కిషన్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ నరసింహన్ యూనివర్శిటీల సమీక్ష చేశారని, కాని ఆయన వాటి పనితీరుపై సంతృప్తి చెందినట్లు వార్తలు వచ్చాయని, ఏమి చూసి సంతృప్తి చెందారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దాదాపు 70 శాతం పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని అన్నారు.మెస్ ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వర్సిటీల పరిస్థితులు ఘోరంగా తయారయ్యాయన్నారు. ఓయూలో ఇప్పటికీ ఒక్క ప్రొఫెసర్ కూడా లేని డిపార్ట్‌మెంట్లు ఉన్నాయన్న సంగతి తెలుసోలేదోనని ఆయన అన్నారు.

tags : kishan, governor

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info