A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి నేతల అతి తెలివి
Share |
July 17 2019, 12:35 am

రాజ్యసభలో బహిరంగంగా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ విషయం గురించి మాట్లాడకుండా వైఎస్ ఆర్ కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు చేయడం విశేషం. బిజెపి,కాంగ్రెస్ లు రెంటికి దూరంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఉండడంపైనే టిడిపి నేతలు పలువురు వ్యాఖ్యానాలు చేశారు.రాజ్యసభ ఉపాద్యక్ష ఎన్నిక జరిగి టిడిపి బలపరిచిన కాంగ్రెస్ ఓడిపోగానే వీరంతా ఆ విషయం గురించి కాకుండా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పై విమర్శల దాడి చేసే వ్యూహం అమలు చేశారు. వైసీపీ ఎంపీలు తమ గైర్హాజరు ద్వారా మేజిక్‌ మార్క్‌ తగ్గించి బీజేపీకి మేలు చేశారని మంత్రి యనమల అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా, బీసీ అయిన ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికి టీడీపీ ఓటు వేసిందని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో జగన్‌ డ్రామాలాడారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇలా ఆయా చోట్ల టిడిపి నేతలు ప్రకటన వర్షం కురిపించారు.ఇదే అతి తెలివి అంటేనేమో!

tags : tdp, strategy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info