ఎపి ప్రభుత్వం అదికారుల పేరుతో ఏభైఎనిమిదివేల కోట్ల వ్యక్తిగత ఖాతాలు తెరచి ఏబైమూడువేల కోట్ల రూపాయల నిధులు మళ్లించిందని ఆరోపిస్తున్న బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావు దానికి ఆదారాలు చూపలేకపోయారని మంత్రి లోకేష్ అన్నారు.నిధులు కావాలంటే పంచాయతీలకు ఖాతాలు తెరవమన్నారని, ఆ విధంగా ఏపీలో 12,918 పంచాయతీలకు ఖాతాలు తెరిచామన్నారు. ఒక్కో పంచాయతీకి రెండు, 3ఖాతాలు ఉంటాయని, అదేమీ నేరం కాదని వివరించారు. అవినీతికి పాల్పడ్డామని చెబుతున్నారని, సాక్ష్యాలు అడిగితే ముఖం చాటేస్తున్నారని ఆయన అన్నారు. బిజెపిని ఓడించడమే తమ లక్ష్యమని లోకేష్ అన్నారు. tags : lokesh, gvl