A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇప్పుడు నా భార్యను టిడిపి టార్గెట్ చేసింది-జగన్
Share |
August 21 2018, 2:06 pm

పెట్టుబడుల కేసులో తన సతీమణి పేరు కూడా తెరపైకి తీసుకు రావడంపై విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఒక బహిరంగ లేఖ రాశారు.ఆ లేఖలో ఆయన ముఖ్యమంత్రి ,తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను ఎలా మేనేజ్ చేస్తున్నారన్న అంశంపై సంచలన ఆరోపణలు చేశారు. ఇడి అదికారులు ఇద్దరిని టిడిపి నేతలు మేనేజ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.గతంలో చంద్రబాబు నాయుడు తన తండ్రి రాజశేఖరరెడ్డిని, ఆ తర్వాత తనను టార్గెట్ చేశారని, ఇప్పుడు తన భార్యను టార్గెట్ చేసి ఇడి అదికారులపై పలుకుబడి ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు.జడ్జి పరిగణనలోకి తీసుకున్న తర్వాతే చార్జీషీట్ లో ఏ విషయాలు ఉన్నాయన్న విషయాలు బయటకు వస్తాయని, అలాంటిది ముందుగానే ఎల్లో మీడియాకు , ఒకటి,రెండు ఆంగ్ల పత్రికలకు ఎలా తెలిశాయని ఆయన ప్రశ్నించారు.సిబిఐ విచారణలో లేని వ్యక్తుల పేర్లను ఇన్నేళ్ల తర్వాత ఎందుకు చార్జీషీట్ లో చేర్చారని ఆయన అన్నారు. తన కుటుంబాన్ని టార్గెట్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుందని ఆయన ప్రశ్నించారు.తన భార్యకు ఈ కేసులతో సంబందం ఏమిటని ఆయన ప్రశ్నించారు.చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఇద్దరు అధికారులు ఉమాశంకర్ గౌడ్, గాందీ ఏ స్థాయిలో వేధిస్తున్నారో తాను ఇప్పటికే ప్రదాని కి ఫిర్యాదు చేశానని ఆయన గుర్తు చేశారు.గాందీ అయితే బదిలీ అయిన తర్వాత మూడుసార్లు పొడిగించుకోగలిగారని, దీనిని కేంద్రం ఆమోదించిందని అన్నారు. తనకు ,బిజెపికి సంబందాలు ఉండి ఉంటే ,నిజంగా ఇలా జరిగే అవకాశం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ,టిడిపిలు కలిసి తనపై కేసులు వేశాయని, అయినా ధైర్యంగా ఎదుర్కున్నానని ఆయన అన్నారు.చంద్రబాబు పగలు కాంగ్రెస్ తో, రాత్రివేళ బిజెపితో సంసారం చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు.చంద్రబాబు బిజెపితో ఇప్పటికీ సంబంధాలు కొనసాగిస్తున్నారనడానికి పలు ఉదాహరణలు కనిపిస్తాయని ఆయన అన్నారు.అలాగే ఆయా వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు.ప్రతిపక్షాలను ఎదుర్కోలేక,వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా రాజకీయం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు.బిజెపితో సంబందాల వల్లే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నాడని ఆయన అన్నారు. గతంలో తన తండ్రిని, ఆ తర్వాత తనను టార్గెట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు తన భార్య బారతిని కూడా తన మనుషుల ద్వారా టార్గెట్ చేయించారని జగన్ ఆరోపించారు. ఈ పరిస్థితి కొనసాగితే ప్రజాస్వామ్యానికి రక్షణ ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు.

tags : jagan, letter

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info