A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎల్లో మీడియాకు ముందుగా ఎలా లీక్ అయింది
Share |
September 19 2018, 2:41 pm

విపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ సతీమణి భారతి పేరు కూడా పెట్టుబడుల కేసులో ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేర్చడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్ దీనిపై ఒక ప్రకటన చేశారు.మీడియాలో ఆ వివరాలు వచ్చాయి. అవి ఇలా ఉన్నాయి. ఈ సందర్భంగా ఎల్లో మీడియాపై కూడా ఆయన విరుచుకుపడ్డారు.

' జగన్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఎల్లోమీడియా ఓర్వలేకపోతోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. సిమెంట్స్ లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో వైఎస్ భారతీ రెడ్డి పేరును ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ లో చేర్చడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. భారతి సిమెంట్స్ పెట్టుబడుల విషయంలో అంతా సవ్యంగా ఉన్నప్పటికీ భారతిరెడ్డి పేరును చార్జిషీట్ లో చేర్చడమంటే దురుద్దేశపూర్వకంగా సాగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం తప్పుబట్టారు. రాజకీయ దురుద్దేశంతో జగన్ మోహన్ రెడ్డిపై అనేక కేసులు దాఖలుకాగా ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆయన భార్య భారతీ రెడ్డి పేరు చార్జిషీటులో చేర్చాల్సిన అవసరమేమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. భారతి సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించి చట్టబద్దం కానిది ఏముందో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చెప్పాల్సిన అవసరముందని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఏడేళ్ల తర్వాత వైఎస్‌ భారతి పేరును చార్జిషీట్‌లో ఎందుకు చేర్చాల్సి వచ్చింది? ఏడేళ్ల తర్వాత భారతి పేరును చార్జిషీట్‌లో చేర్చడంలోని ఆంతర్యమేంటి? అని తమ్మినేని ప్రశ్నించారు. భారతీ సిమెంట్స్‌ మెజారిటీ వాటాను ఫ్రాన్స్‌ కంపెనీ వికా కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలుసని ఆయన గుర్తు చేశారు. చార్జిషీట్‌లో తన పేరును పెట్టిన విషయం భారతీరెడ్డికన్నా ముందుగా ఎల్లో మీడియాకు ఎలా లీకైంది? ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ లో పనిచేస్తున్న ఉమాశంకర్‌ గౌడ్‌, గాంధీ అనే అధికారులతో టీడీపీకి సంబంధాలున్నాయన్న విషయంపై గతంలోనే ఫిర్యాదు చేశామని, ఆ అధికారులే ఇటు టీడీపీకి లీకులు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారతి సిమెంట్స్‌లో పెట్టుబడులు అంతా సక్రమంగానే జరిగాయని స్పష్టం చేస్తూ ఈ కేసును టీడీపీ అభిష్టానికి అనుగుణంగా బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. బీజేపీ అగ్రనేతలతో బాబుకు ఫెవికాల్‌ బంధం ఉందని, చంద్రబాబు శాశ్వత మిత్రుడు అని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ చెప్పిన విషయాన్ని తమ్మినేని ఇక్కడ ప్రస్తావించారు. ఓటకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికినా చంద్రబాబుపైన చర్యలు తీసుకోలేదని, ఇన్నేళ్లయినా ఆ కేసు ముందుకు సాగకపోవడంలోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ప్రజలనుంచి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక జగన్ మోహన్ రెడ్డిపై ఇలా ఎన్ని తప్పుడు కేసులు బనాయించినప్పటికీ ఆయన ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేరని, తప్పుడు ప్రచారం సాగిస్తున్న వారికి ప్రజలు తగిన సమయంలో బుద్ది చెబుతారని ఆయన హెచ్చరించారు." అని ఆ కదనంలో వివరించారు.

tags : tammineni, yellow media

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info