A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రతినెల రాహుల్ తెలంగాణ పర్యటన
Share |
December 15 2018, 1:22 am

తెలంగాణలో కాంగ్రెస్ ను అదికారంలోకి తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగా ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ ఇకపై ప్రతి నెల తెలంగాణకు వస్తారని పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి చెప్పారు. ఈనెల 13, 14 తేదీల్లో జరిగే రాష్ట్ర పర్యటనలో ఆయన అన్ని వర్గాలతో మమేకమవుతారని వెల్లడించారు. ఈసారి పర్యటనలో కాంగ్రెస్‌ కేడర్‌తో పాటు మహిళలు, సెటిలర్లు, ఎడిటర్లు, యువపారిశ్రామికవేత్తలు, ముస్లిం మేధావులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారని వివరించారు. శంషాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ ప్రజా చైనత్య యాత్ర బస్సులో రాజేంద్రనగర్‌కు వెళతారని, అక్కడ దాదాపు 15 వేల మంది మహిళలతో సమావేశమవుతారని చెప్పారు. రాజేంద్రనగర్‌ క్లాసిక్‌ గార్డెన్‌లో జరిగే సమావేశంలో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడతారని, మహిళా బిల్లును బీజేపీ ఎలా అడ్డుకుంటోందో వివరిస్తారని చెప్పారు. శేరిలింగంపల్లిలో సెటిలర్లతో సమావేశమై బేగంపేటలోని హరిత ప్లాజాలో రాత్రి బసచేస్తారని చెప్పారు. ఈ నెల 14న రాష్ట్రంలో దాదాపు 38 వేల మంది బూత్‌ కమిటీ అధ్యక్షులు, మండల పార్టీ, డీసీసీ అధ్యక్షులు, ఆఫీస్‌ బేరర్లతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడతారని వెల్లడించారు. ఆ తర్వాత తెలంగాణలోని ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలకు చెందిన ఎడిటర్లతో సమావేశమవుతారని, తాజ్‌కృష్ణాలో యంగ్‌ ప్రెసిడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.

tags : rahul, telangana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info