A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ‌లో స్మార్ట్ మీట‌ర్ల ఉత్ప‌త్తి యూనిట్‌
Share |
July 16 2019, 11:41 pm

స్మార్ట్ మీట‌ర్లను ఉత్ప‌త్తి చేసే చైనాకు చెందిన హ్యాంగ్జో స‌న్ రైజ్ టెక్నాల‌జీ
కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు
వ‌చ్చింది. ప్ర‌భుత్వం భూమి కేటాయిస్తే రూ.100 కోట్ల పెట్టుబ‌డిని పెట్ట‌డానికి
సంసిద్ధ‌త‌ను వ్య‌క్తం చేసింది. గురువారం హ్యాంగ్జో స‌న్ రైజ్ టెక్నాల‌జీ కంపెనీ 
వైస్ ప్రెసిడెంట్ యాంగ్ గ్వాంగ్‌,  డైరెక్ట‌ర్ డేవిడ్ లియాంగ్ టీఎస్ ఐఐసీ చైర్మ‌న్
గ్యాద‌రి బాల‌మ‌ల్లుతో ప‌రిశ్ర‌మ భ‌వ‌న్‌లో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా
చైనా కంపెనీ ప్ర‌తినిధులు తెలంగాణ నూత‌న పారిశ్రామిక విధానం(టీఎస్‌-
ఐపాస్‌) గురించి తెలుసుకొని బాగుంద‌ని కితాబిచ్చారు. స్మార్ట్ మీట‌ర్ల

త‌యారీకి సంబంధించి త‌మ‌కు జ‌ర్మ‌నీ, ఇండోనేషియా, తైవాన్ దేశాల్లో
యూనిట్లు ఉన్నాయ‌ని తెలిపారు. స్మార్ట్ విద్యుత్ మీట‌ర్లు, స్మార్ట్ వాట‌ర్
మీట‌ర్లు, స్మార్ట్ గ్యాస్ మీట‌ర్ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు చెప్పారు.  ప్ర‌పంచ
వ్యాప్తంగా త‌మ కంపెనీ ఉత్ప‌త్తుల‌కు మంచి మార్కెటింగ్‌, డిమాండ్ ఉంద‌ని
పేర్కొన్నారు. పరిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ఇండియాలో తెలంగాణ రాష్ట్రం
సుర‌క్షిత‌మైనందున ఇక్క‌డ స్మార్ట్ మీటర్ల ఉత్ప‌త్తి యూనిట్‌ను
నెల‌కొల్పేందుకు సంసిద్ధంగా ఉన్నామ‌ని హ్యాంగ్జో స‌న్ రైజ్ టెక్నాల‌జీ కంపెనీ
ప్ర‌తినిధులు బాల‌మ‌ల్లుకు వివ‌రించారు. 10 ఎక‌రాల స్థ‌లాన్ని కేటాయిస్తే
తెలంగాణ‌కు చెందిన పారిశ్రామిక‌వేత్త‌ల భాగ‌స్వామ్యంతో స్మార్ట్ మీటర్ల ఉత్ప‌త్తి
యూనిట్‌ను ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. రెండు ద‌శ‌ల్లో రూ.100 కోట్ల
పెట్టుబ‌డులు పెడ‌తామ‌ని, త‌మ యూనిట్ ఏర్పాటుతో వెయ్యి మందికి ఉపాధి
అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని చైనా కంపెనీ ప్ర‌తినిధులు టీఎస్ ఐఐసీ చైర్మ‌న్‌కు
వివ‌రించారు. స్మార్ట్ మీట‌ర్ల ఉత్ప‌త్తి యూనిట్ ఏర్పాటు విష‌యాన్ని సీఎం
కేసీఆర్‌, ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి కేటీఆర్ ద్ర‌ష్టికి తీసుకువెళ్లి రాష్ట్రంలో స్థ‌లాన్ని
కేటాయించేలా చూస్తాన‌ని చైనాకు చెందిన హ్యాంగ్జో స‌న్ రైజ్ టెక్నాల‌జీ కంపెనీ
ప్ర‌తినిధుల‌కు టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లు హామీ ఇచ్చారు. ఈ
సంద‌ర్భంగా భేటీలో తెలంగాణ పారిశ్రామికవేత్త‌ల స‌మాఖ్య‌(టీఐఎఫ్‌)
అధ్య‌క్షుడు కే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

tags : smart meters, telangna

Latest News
*కాపు టిడిపి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చెబుతున్నారు
*టిడిపిలా మాది కులపిచ్చి పార్టీ కాదు- అంబటి
*కాపులను చంద్రబాబు మోసం చేశారన్న జగన్
*గ్రామ సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లు
*కూలిన భవనం -శిధిలాలలో నలభై మంది
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*అవినీతి ఆరోపణలపై వైసిపి ముందుకు వెళ్లాలా?వద్దా
*కర్నాటకలో ఇక ఎమ్మెల్యేలపై పోలీస్ ప్రయోగం
*పాక్ గగనతలం నుంచి ప్రయాణించవచ్చు
*బుగ్గన బడ్జెట్ కొత్త పుంతలు..కాని సందేహాలు
*'వైసిపి ప్రభుత్వం సందేహాలతోనే--బుచ్చయ్య చౌదరి
*దొబ్బేశారని ఎందుకు అన్నానంటే..మంత్రి
*చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారం..
*జగన్ ను అబినందించిన బిసి నేతలు
*డ్వాక్రా రుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని అనలేదు
*కాంగ్రెస్ కార్యకర్తల ఒత్తిడితోనే పార్టీ మారా
*ఎపికి కొత్త గవర్నర్ నియామకం -హరిచందన్
*జగన్ ను అబినందించిన సినీ ప్రముఖుడు
*అవినీతి అన్నది తగ్గుతోందా- కలెక్టర్ లతో జగన్
*అవును ఆ ఆస్తి కాజేశాను..కేశినేని ట్వీట్
*చెప్పింది 43 లక్షల ఉద్యోగాలు..వచ్చింది 30 వేలు
*అచ్చెన్నాయుడు వివాదం- ఇబ్బందిపడ్డ చంద్రబాబు
*బిజెపిలో మాజీ ప్రధానమంత్రి కుమారుడు
*పోలవరం ప్రాజెక్టులో 2343 కోట్ల అదనపు చెల్లింపులు
*కోడెల కుటుంబంపై వైసిపి ఎమ్మెల్యే ఆరోపణ
*అచ్చెన్నాయుడు ద్వేషపూరిత మాటలు చూడండి
*చంద్రబాబుతో నాగం భేటీ ఆంతర్యం
*ఎపి స్కూళ్లలో బయోటాయిలెట్స్
*కొత్తగా ఎపిలో మూడు స్టేడియం లు
*బుద్దిఉన్నవాడు బిజెపిలో చేరతాడా
*ఇంగ్లాండ్ మాదిరి గెలుస్తాం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info