ప్రత్యేక హోదా నినాదంతో ఉద్యమాలు చేసిన యువకులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసులు పెట్టారని, కాని ఇప్పుడు ఆయనే హోదా అంటూ ,పోరాటాలు అంటూ మాట్లాడుతున్నారని, అందువల్ల ఆయనపైనే కేసులు పెట్టాలని ఎపి శాసనమండలిలో విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.చంద్రబాబు ప్రత్యేక హోదాపై యుటర్న్ తీసుకున్ఆరని ఆయన ద్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేని అసమర్థుడని తేలిపోయిందని ఆయన అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా, నరేంద్ర మోదీ ప్రధాని అయినా ఏపీకి హోదా రాలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన అసమర్థతను ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. tags : chadrababu, ummareddy