A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ ముసుగు తొలగిపోయింది
Share |
October 16 2018, 10:47 am

ఎన్.డి.ఎ.కూటమికి తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ ముసుగు తొలగిపోయిందని కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు.టిఆర్ఎస్ కు ఎవరితో సంబందాలు ఉన్నాయో తేలిపోయిందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీతో కలిసి వెళ్లబోతున్నారని చెప్పడానికి ఇవే సంకేతాలని ఆయన అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్‌కు సహకరించని మోదీకి ఎందుకు మద్దతు ఇచ్చారో టీఆర్ఎస్ చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. మోదీకి-కేసీఆర్ మధ్య సంధానకర్తగా ఆదాని వ్యవహరించారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ మార్వా విద్యుత్ ఉత్పత్తి కంపెనీకి ఆదాని కంపెనీనే బొగ్గు సరఫరా చేస్తోందని తెలిపారు. మార్వా కంపెనీ విద్యుత్‌ను తెలంగాణ కొనుగోలు చేయకపోతే ఆదాని కంపెనీ దివాలా తీసేదాని ఆయన అన్నారు. టిఆర్ఎస్ కు ఇప్పుడు మద్దతు ఎలా ఇస్తున్నారో ఒవైసీ ఆలోచించాలని కూడా ఆయన అన్నారు.

tags : revanth, trs, congress,bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info