A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చిన్నారి ఏడ్చితే విమానం నుంచి దించేస్తారా
Share |
December 15 2018, 1:25 am

ఒక భారతీయ కుటుంబం పట్ల అనుచితంగా వ్యవహరించిన బ్రిటిష్ ఎయిర్ వేస్ పై కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఆగ్రహం వ్యక్తం చేశారు.లండన్ నుంచి బెర్లిన్ కు వెళుతున్న విమానంలో మూడేళ్ల చిన్నారి ఏడ్చుతోందన్న కారణంగా బ్రిటిష్ ఎయిర్ వేస్ విమాన క్యాబిన్ సిబ్బంది ఆ చిన్నారి కుటుంబంపై అసహనం వ్యక్తం చేశారు. బ్లడీ ఇండియన్స్ అని కూడా అన్నారట. ఆ తర్వాత టెరిమినల్ కు తీసుకు వెళ్లి ఆ కుటుంబాన్ని విమానం నుంచి దించేశారట. గత నెల ఇరవై మూడున ఈ ఘటన జరిగింది. ఆ చిన్నారి తండ్రి ఈ విషయాన్ని వివరిస్తూ కేంద్ర మంత్రి ప్రభుకు లేఖ రాశారు. దానిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి దర్యాప్తు కు ఆదేశించారు. కాగా ఈ ఘటన పై బ్రిటిష్ ఎయిర్ వేస్ కూడా విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది.ఇది వివక్షతో కూడిన వ్యవహారంగానే భారత ప్రభుత్వం బావిస్తోంది.

tags : suresh prabhu, flight

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info