A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్ఎస్ ఎస్ ను పొగిడిన కాంగ్రెస్ నేత
Share |
December 15 2018, 1:04 am

కాంగ్రెస్ లో గొడవలను చూసి పడలేక ఒక నేత కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక సలహా ఇచ్చారట. రాష్ట్రీయ స్వయం సంఘ్ సేవక్ ( ఆర్ఎస్ఎస్ ) నుంచి క్రమశిక్షణ నేర్చుకోండని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దీపక్ బాబారియా వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ అంటే అంటేనే కాంగ్రెస్ నాయకత్వం మండిపడుతుంది.అలాంటిది ఆర్ఎస్ ఎస్ నుంచి నేర్చుకోండని ఎఐసిసి ప్రదాన కార్యదర్శే చెప్పడం కాంగ్రెస్ కు జీర్ణం కాని విషయం గా మారింది. భారత్‌-చైనా యుద్ధ సమయంలో ఆర్‌ఎ్‌సఎస్‌ సేవలను నెహ్రూ వినియోగించుకోవడాన్ని ప్రశంసించిన విధంగానే ఆర్‌ఎస్ ఎస్ క్రమశిక్షణ గొప్పదని మెచ్చుకుంటున్నానని కూడా ఆయన అన్నారు. ఏ సంస్థలోనైనా మంచి ఉంటే గ్రహించాలి. ఆ మంచిని అభినందిస్తే నష్టం ఏమీ లేదని కూడా బాబారియా వ్యాఖ్యానించారు.

tags : congress, rss

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info