A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ను బతిమలాడినా ఒప్పుకోలేదు
Share |
December 15 2018, 1:26 am

భారతీయ జనతా పార్టీ బతిమలాడినా వైఎస్ ఆర్ కాంగ్రెస్ గత ఎన్నికలకు ముందు పొత్తుకు అంగీకరించలేదని మాజీ ఎమ్.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.గుంటూరులో జరిగిన టిడిపి వంచనకు వ్యతిరేకంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ అదినేత జగన్ ఒక విదానానికి కట్టుబడి బిజెపి వారు ఎంత అభ్యర్ధించినా అప్పట్లో పొత్తుకు వెళ్లలేదని చెప్పారు. మీరు పొత్తుకు రాకపోతే, చంద్రబాబు సిద్దంగా ఉన్నారని చెప్పినా జగన్ అంగీకరించలేదని ఆయన అన్నారు .ఎన్నికల తర్వాత ఏ పార్టీ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడుతుందో వారికి పార్లమెంటులో మద్దతు ఇవ్వడం జరుగుతుందని అప్పుడే చెప్పడం జరిగిందని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు మహా మాయావి అని, ప్రజాస్వామ్య వ్యవస్థకు పెద్ద ప్రమాదకరంగా మారారని మేకపాటి అన్నారు. ఇరవై మూడు మంది వైసిపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయవలసిన అవసరం ఏమి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. దీని గురించి మోడీకి చెప్పినా ఫలితం లేకపోయిందని ఆయన అన్నారు.మోడీ కన్నా,వాజ్ పేయి గొప్ప వ్యక్తి అని, ఒక్క ఓటుతో ఓడిపోతామని తెలిసినా ఆయన అలాంటి పనులు చేయలేదని మేకపాటి అన్నారు.

tags : mekapati jagan, bjp, ysr congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info