A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పిహెచ్ డి ల ప్రక్షాళన జరుగుతుందా
Share |
October 16 2018, 10:49 am

పిహెచ్ డి కోసం పరిశోధక విద్యార్దులు చేస్తున్న విన్యాసాలపై గవర్నర్ నరసింహన్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. పిహెచ్ డి సాదారణ డిగ్రీ కాదని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఒక పరిశోధన అని ఆయన అన్నారు.అలాంటి పిహెచ్ డి స్థాయి దిగజార్చరాదని ఆయన అన్నారు. కొన్ని యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. అడ్డగోలుగా ప్రవేశాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వాటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టండి’’ అని యూనివర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లు, రిజిస్ట్రార్లను గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టం చేశారు. నాలుగైదేళ్లకు మించి పీహెచ్‌డీకి సమయం ఇవ్వడానికి వీల్లేదని, ఐదేళ్లు దాటిన వారి ప్రవేశాలను రద్దు చేయాలని, అలాంటి వారు ఎందరు ఉన్నారో తేల్చాలని వైస్‌ చాన్స్‌లర్లను ఆదేశించారు. పిహెచ్ డి ల తీరుతెన్నులపై నివేదిక ఇవ్వాలని కూడా ఆయన ఆదేశించారు.పిహెచ్ డి ల ప్రవేశాలు కూడా ఇష్టారాజ్యంగా సాగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.పిహెచ్ డి ల ప్రక్షాళన జరుగుతుందా!

tags : governor, phd

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info