A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోమటిరెడ్డి, సంపత్ ల కేసు- కొత్త మలుపు
Share |
July 17 2019, 12:24 am

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,సంపత్ ల పై వేసిన అనర్హత వేటు కేసులో ఆత్మరక్షణలో పడిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అప్పీల్ కు వెళుతోంది.అయితే అనర్హత వేటు చెల్లదని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన రెండు నెలలకు అప్పీల్ చేయడం విశేషం.ఈ మేరకు గత ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇప్పుడు శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావు అప్పీళ్లు దాఖలు చేశారు.
. తమకు కోర్టు ధిక్కారం కింద ఫారం–1 నోటీసు జారీ చేసి, వాదనలు విని శిక్షించే అవకాశం ఉందని భావించిన కార్యదర్శులు ఇన్ని రోజుల తర్వాత అప్పీళ్ల మార్గాన్ని ఎంచుకున్నారు. మొదట్లో ఈ కేసులో కోర్టు తీర్పును పట్టించుకోకూడదన్న వైఖరితో వ్యవహరించిన శాసనసభ కార్యదర్శి.. రోజు రోజుకూ పరిస్థితి చేయి దాటుతుండటం, కోర్టు ధిక్కారం విషయంలో జస్టిస్‌ శివశంకరరావు గట్టిగా వ్యవహరిస్తుండటంతో భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే అప్పీల్‌ దాఖలు చేశారు. సింగిల్‌ జడ్జి వద్ద తీర్పు అమలుకు ప్రయత్నిస్తున్నామని చెప్పి, ఇప్పుడు అప్పీళ్లు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది.

tags : high cout, komatireddy, sampat

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info