A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఐఎఎస్ కు రాజీనామా చేసి వ్యవస్థల బాగుకోసం..
Share |
December 12 2018, 8:54 am

ప్రభుత్వ వ్యవస్థలను బాగుపర్చాలన్న లక్ష్యంతో ఐఎఎస్ లో చేరి కొన్నేళ్ల పాటు ఉద్యోగం చేసిన ఒక అదికారి ఇప్పుడు ఉద్యోగం నుంచి బయటకు వచ్చి ప్రభుత్వ వ్యవస్థలను బాగు చేసే కృషి చేయాలని భావిస్తున్నారు. విజయ మారుతి పింగలే అని తమిళనాడు క్యాడరు ఐఎఎస్ అదికారి నిజాయితీపరుడైన అదికారిగా, అవినీతిని రూపుమాపే కృషి చేసే అదికారిగా పేరొందారు.2004 బాచ్ ఐఎఎస్ ఆఫీసర్ అయిన ఈయన చెన్నై కార్పొరేషన్ లో పనిచేస్తుండగా పలు చర్యలు తీసుకున్నారు. రోడ్లు సరిగా వేయని కాంట్రాక్టర్ లకు జరిమానా విధించడం, సివిక్ కాంట్రాక్ట్ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ఒక సాప్ట్ వేర్ తయారు చేయడం, టాయిలెట్ల నిర్వహణలో అవినీతిని పసికట్టి జరిమానా విధించడం వంటివి తీసుకున్నారు. కాని కాంట్రాక్టర్లు రాజకీయ నేతలపై ఒత్తడి తెచ్చి ఆయనను బదిలీ చేయించారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఈయన తన ఐఎఎస్ కు రాజీనామా చేయాలని నిర్ణయించుకుని పత్రాలు సమర్పించారు. అవి ఇంకా ఆమోదం పొందలేదు. అయితే ఆయన సుపరిపాలన కోసం కృషి చేసే ఒక స్వచ్చంద సంస్థలో చేరనుండడం విశేషం.అక్కడ ఇందుకు సంబందించిన సాప్ట్ వేర్ తయారు చేసే పనిలో ఆయన ఉండాలని బావిస్తున్నారు.

tags : vijay, ias, resign

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info