A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గీతపై అనర్హత వేటు వేయండి
Share |
December 15 2018, 1:28 am

ఫిరాయింపుదారుల విషయంలో కేంద్రం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వైఎ్ ఆర్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్.పిలపై చర్యలు తీసుకోవాలని పలు మార్లు ఆ పార్టీ కోరినా స్పీకర్ సుమిత్ర మహాజన్ పట్టించుకోవడం లేదు. మరోసారి ఆ పార్టీ ఎమ్.పి విజయసాయిరెడ్డి స్పీకర్ కు ఈ విషయంపై పిర్యాదు చేశారు.వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా అరకు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి గెలుపొంది పార్టీ ఫిరాయించిన ఎంపీ కొత్తపల్లి గీతపై తక్షణమే అనర్హత వేటు వేయాలని వి.విజయసాయిరెడ్డిమరోసారి ఆమెకు లేఖ రాశారు. వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆమె లేఖ రాశారని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ నిబంధనల ప్రకారం గీత లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.ప్రస్తుతం గీత వైఎస్సార్‌సీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని ప్రధాన సాక్ష్యంగా పరిగణించాలని, రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఆమెపై తక్షణమే అనర్హత వేటు వేయాలని ఆయన కోరారు.గతంలో కూడా తమ పార్టీ ఈ విషయాన్ని కోరిందని ఆయన గుర్తు చేశారు.

tags : vijayasai, geeta, disqualification

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info