ఆర్దిక సంఘుం విధి ,విధానాలను మార్చాలన్న కొన్ని రాష్ట్రాల డిమాండ్ కు కేంద్రం నో చెప్పింది.వాటిని మార్చలేమని కేంద్రం తెలిపింది.వాటిని ఇప్పటికే ప్రకటిచడం జరిగిందని కేంద్రం తెలిపింది. ఏ సంస్థ విధివిధానాలను మార్చాలని కేంద్రం సిఫారసు చేయబోదని ఆర్థికశాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తెలిఇయచేశారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన మంగళవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కమిషన్ నిధుల కేటాయింపు చేస్తే ఆంధ్రప్రదేశ్‌కు రూ.24వేల కోట్ల నష్టం వాటిల్లుతుందా? అని అడగ్గా కేంద్రమంత్రి జవాబు ఇవ్వలేదు. tags : parliament