A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గురుమూర్తికి ఆర్బిఐ డైరెక్టర్ పదవి
Share |
July 20 2019, 2:17 am

ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు,పాత్రికేయుడు ఎస్.గురుమూర్తిని రిజర్వ్ బ్యాంక్ బోర్డు సబ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది.ఆయనతో పాటు సహకార భారతీ చీఫ్ సతీష్ కాశీనాథ్ మరాథెని ఆర్‌బీఐ బోర్డులో పార్ట్‌ టైం డైరెకర్లుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. వీరి పదవీకాలం నాలుగేళ్లు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. వీరి నియామకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఈ నియామకాలతో ఆర్‌బీఐ బోర్డులో సభ్యుల సంఖ్య 10కి చేరింది. కాగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ, స్వదేశీ జాగరణ్ మంచ్‌కు ఉప కార్యదర్శిగా ఉన్న గురుమూర్తి అర్థశాస్త్రవేత్త, సీఏ పూర్తి చేశారు. వృత్తిరీత్యా చార్టెడ్‌ అకౌంటెంట్‌ అయినా, తమిళంలో తుగ్లక్‌ అనే రాజకీయ వార పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

tags : rbi, director, gurumurthy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info