ప్రజా నాయకుడిగా వెలుగొంది అమరుడైన ఒక తండ్రిని ఉద్దేశించి మరో ప్రజానాయకుడుఐన కొడుకు రాసిన భావోద్వేగ లేఖ ఇది. నాన్నా ..నిన్ను ఒకసారి నాన్న అని పిలుస్తానంటూ రాసిన ఈ లేఖ పలువురిని ఆకర్షిస్తోంది.చివరిసారి నాన్నా అని పిలుస్తానని స్టాలిన్ ఆ లేఖలో పేర్కొన్నారు.ఇంతకాలం నాన్న అనే బదులు తలైవర్ అంటే నాయకుడు అని ఎక్కువసార్లు పిలిచేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు.ఎప్పుడూ ఎక్కడకు వెళ్లినా చెప్పే వెళ్లే నీవు ఈసారి చెప్పకుండా వెల్లిపోయావని ఆవేదనతో అన్నారు. 33 ఏళ్ల క్రితం సమాధి గురించి మీరు చెప్పిన వాఖ్యలు నాకు బాగా గుర్తుకు ఉన్నాయి. ఎవరైతే విశ్రాంతి లేకుండా పని చేస్తారో వారు ఇక్కడ(సమాధి) విశ్రాంతి పొందుతారు’ అని చెపారు. మీరు తమిళ ప్రజల కోసం విశ్రాంతి లేకుండా కృషి చేసి సంతృప్తితో అక్కడికి(సమాధి) సేద తీరడానికి వెళ్లారని ఆశిస్తున్నా’అని స్టాలిన్ కూడా భావేద్వేగంతో ఈ లేఖ రాయడం విశేషం. tags : stalin, karunanidhi