A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ టిడిపి మద్దతు- అదికారిక ప్రకటన
Share |
December 15 2018, 12:53 am

కాంగ్రెస్ పార్టీ అభ్యర్దికి తెలుగుదేశం మద్దతు ప్రకటించింది.రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలో కాంగ్రెస్ తరపున కర్నాటక ఎమ్.పి బికె హరిప్రసాద్ పోటీచేస్తున్నారు. హరిప్రసాద్ కు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తున్నట్లు టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి ప్రకటించారు. టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తరఫున తమ పార్లమెంటరీ పార్టీ హరిప్రసాద్‌కే మద్దతివ్వాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ ,తెలుగుదేశం ల పొత్తుపై ఊహాగానాలు సాగుతున్నాయి. అందుకు ప్రాతిపదికగా తెలుగుదేశం పార్టీ ముందుగా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడం విశేషం.గత నాలుగేళ్లుగా బిజెపితో కలిసి ఉన్న టిడిపి ఇప్పుడు కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లేనా!

tags : sujana, tdp, congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info