A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గుంటూరు జిల్లా నవరత్నాలు వీరట- బొత్స
Share |
August 21 2018, 2:07 pm

తాము ప్రజలకు నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పదకాలను ప్రతిసాదిస్తే, తెలుగుదేశంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు దోచుకునే పనిలోఉన్నారని, వారు తెలుగుదేశం నవరత్నాలుగా మారారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ లో ఘనాపాటిగా ఉన్నారని, ఆయన ఈ నవరత్నాలలో ఒకరని బొత్స అన్నారు. ఇసుక అక్రమ రవాణాలో పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మరో రత్నంగా ఉన్నారని అన్నారు. చెరువుల మట్టి అమ్మకంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర , భూముల సెటిల్ మెంట్ లో రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్, విద్యాలయాలలో దోపిడీ, తెనాలి సెటిల్ మెంట్ లలో తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా,వ్యవసాయ సబ్సిడీల దోపిడీలో వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు ఈ నవరత్నాలలో బాగంగా ఉన్నారని ఆయన అన్నారు. ఇక మంత్రులు ఇద్దరు , స్పీకర్ కోడెల శివప్రసాదరావుల సంగతి చెప్పనవసరం లేదని అన్నారు. వీరు ముగ్గురు వీటిలో త్రిమూర్తులుగా ఉన్నారని ఆయన ద్వజమెత్తారు.మంత్రి పుల్లారావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావులు దేనని వదలిపెట్టడం లేదని అన్నారు. గుంటూరు జిల్లాలో వీరంతా సామంత రాజులు గా మారి చంద్రబాబుకు కప్పం కడుతూ ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారని బొత్స ఆరోపించారు.వీరంతా గుంటూరు జిల్లాను దోచుకుంటున్నారని బొత్స ఆరోపించారు.

tags : botsa, tdp,mlas, scams

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info