A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతితో కాంట్రాక్టర్ లకు పంటే
Share |
December 12 2018, 9:20 am

అమరావతి రాజదానిలో రోడ్లు,తదితర పనులు చేపట్టే కాంట్రాక్టర్ ల పంట పండుతోందట. ఈ విషయమై వస్తున్న కధనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అమరావతిలో కాంట్రాక్టర్లకు మెటీరియల్‌ కోసం అంటూ అదనంగా 5 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని ఆ కదనం చెబుతోంది. ఇందుకోసం గతంలో కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలను సవరించడంతోపాటు టెండర్‌ నిబంధనలను సడలించాలని ఆదేశించారు. గతంలో జారీచేసిన జీవోలు 94, 50 ప్రకారం కాంట్రాక్టర్లకు 10 శాతం మాత్రమే మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు చెల్లించాల్సి ఉంది. టెండర్‌ ఒప్పందం చేసుకున్న తరువాత కాంట్రాక్టు విలువలో 2.50 శాతం, మిషనరీ తెచ్చిన సమయంలో 2.50 శాతం, మెటీరియల్‌ కోసం 5 శాతం.. మొత్తం కలిపి 10 శాతం మాత్రమే మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు చెల్లించాలి. అయితే రాజధానిలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు అదనంగా మరో 5 శాతం చెల్లించాలని ప్రతిపాదించారు. రాజధానిలో పనులు చాలా ఖరీదుతో కూడినవని, స్పెషలైజ్డ్‌ మెటీరియల్‌ కాంట్రాక్టర్లు సమకూర్చుకోవాల్సి ఉందని, ఇందుకోసం అధికంగా వ్యయం అవుతుందని అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొషన్‌ తెలిపింది.టెండర్లు ఖరారైన తర్వాత ఇఆ చేయడం కుదరదని అదికారులు చెప్పినా,ముఖ్యమంత్రి ససేమిరా అని ఈ ఆదేశాలు జారీ చేయించారట.

tags : amaravati, contractors

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info