A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.ఎమ్. డాష్ బోర్డులో ఈ అక్రమాలు కనిపించవా!
Share |
July 17 2019, 12:48 am

ఆంద్రప్రదేశ్ లో పాలన ఎంత అద్వాన్నంగా ఉంది ఈ ఘటన తెలియచేస్తుంది.కర్నూలు జిల్లాలో ఇద్దరు టిడిపి నేతల క్వారీలో పేలుడు సంభవించి పదకుండు మంది మరణించడం, మరికొందరు గాయపడడం విచారకరం.అధికారులు తమ భాద్యతలు సరిగా నిర్వహించడం లేదనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏమి కావాలి. ఇప్పటికే సంబంధింత శాసనసభ్యుడు జయరాములు అదికారులకు ఈ క్వారీ గురించి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీకి సంబందించినవారు కావడమే అనుకోవాలి. ఇది ఆంద్ర సమాజానికి తీవ్రమైన చేటు తెస్తుంది.ఎపిలో నేరాలు జరగడానికి వీలు లేదని ఆయా సందర్భాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం కోసం చేసుకుంటారు.నిజంగానే ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లయితే ఆయనకు మంచి పేరు వచ్చేది.కాని 2014 లో అదికారంలోకి వచ్చిన వెంటనే తమ పార్టీ వారు ఏమి చేసుకున్నా చూసి,చూడనట్లు పోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్.పిల సమావేశంలోనే స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన దాని ఫలితమే ఈ అరాచకాలు.వీటికి సామాన్యులు బలి అవుతున్నా ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేని పరిస్థితి ఏర్పడింది.ఆంద్రప్రదేశ్ లో మానవ ప్రాణాలకు పెద్దగా విలువ లేకపోవడం బాదాకరం. ఎర్రచందనం స్మగ్లర్ లను అదుపు చేసే ప్రక్రియలో ఇరవై మంది కూలీలను కాల్చితే అదేమిటి అని అడిగే పరిస్తితి లేకుండా పోయింది.గోదావరి పుష్కరాలలో తొక్కిసలాటలో ఇరవై తొమ్మిది మంది మరణిస్తే, కనీసం కేసు కూడా పెట్టలేదు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రచార యావ వల్లే ఈ ఘటన జరిగిందని అప్పట్లో విమర్శలు వచ్చాయి.ఒక సీనియర్ ఐపిఎస్ అదికారిపై టిడిపి ఎమ్.పి,ఎమ్మెల్యే దౌర్జన్యంగా వ్యవహరిస్తే ముఖ్యమంత్రి స్తాయిలో వారే రాజీ చేస్తే ఎవరికి చెప్పుకోవాలి?గుంటూరు జిల్లాలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆద్వర్యంలో అక్రమ మైనింగ్ పెద్ద ఎత్తున జరుగుతోందని ఆరోపణలు వస్తే పట్టించుకోని అదికార వ్యవస్థ మనది.చివరికి హైకోర్టు జోక్యం చేసుకుని విచారణకు ఆదేశాలు ఇవ్వవలసి వచ్చింది. రాజదాని కి సమీపంలోని పిరంగిపురం వద్ద కూడా క్వారీలో పేలుడు జరిగి ఆరుగురు మరణించారు.కృష్ణానదిలో అక్రమ ఇసుక మైనింగ్ వల్ల ఏర్పడిన గోతిలో పడి ఇద్దరు యువకులు మరణించారని గతంలో వార్తలు వచ్చాయి. .ఇవన్ని ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే ప్రభుత్వంలో పాలక వ్యవస్త, పోలీసు వ్యవస్థలకు పక్షవాతం అనండి, పక్షపాతం అనండి ఎలా సోకిందనడానికి ఇవన్ని ఉదాహరణలు అవుతాయి.ఇది ఆంద్ర సమాజానికి ప్రమాదకరం అని చెప్పక తప్పదు. గతంలో కూడా ఇలా కొంత మేర జరిగి ఉండవచ్చు. కాని ఇప్పుడు అడ్డగోలుగా హద్దులు దాటి పోయిందన్నదే భాధ.కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లాలోనే ఇలాంటి ప్రమాదానికి ముగ్గురు సోదరులు మరణించారు. ఆ తర్వాత అయితే మైనింగ్ అదికారులు, రెవెన్యూ అదికారులు ఇతర చోట్ల చర్యలు తీసుకుని ఉంటే, తనిఖీలు చేసి ఉంటే ఇంత విషాదం జరిగి ఉండేది కాదు కదా..తెలుగుదేశం నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నా, చూసి,చూడనట్లు పోతున్న తీరు నిజంగా ఆందోళన కలిగించేదే. ఇసుక మాఫియా తో పాటు మైనింగ్ మాఫియా కూడా ఎపిలో విస్తరించి పోవడం ప్రమాదకరమని చెప్పాలి. ఈ అక్రమాల ద్వారా సంపాదించే అడ్డగోలు డబ్బుతో వచ్చే ఎన్నికలలో గెలవాలన్న ఏకైక లక్ష్యంతో అదికార తెలుగుదేశం పార్టీ సమాజ శ్రేయస్సును విస్మరిస్తోంది.ఇది మంచిదా?కాదా అన్నది ప్రజలంతా ఆలోచించవలసిన తరుణం వచ్చింది. నంద్యాలలో ఒక మారుమూల వార్డులో వీధి లైట్ల వెలగకపోతే తన డాష్ బోర్డులో తెలిసిపోతుందని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ అక్రమాలన్ని తెలియవని అనుకోగలుగుతామా? నిజంగానే ఆయనకు వీటిపై చిత్తశుద్ది ఉండి ఉంటే ఇలాంటి ఫిర్యాదులు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుని ఉండేవారు.ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలోపు అదికార పార్టీ వారు ఇంకెన్ని దందాలు చేస్తారో తెలియదు.తమది సుపరిపాలన అని చెప్పుకునే నేతలు దీనిని అంతటిని ఏ పాలన అంటారో వారే చెప్పాలి. సుపరిపాలన పేరుతో దుష్పరిపాలన సాగితే చివరికి అది వారికే చేటు తెస్తుంది.

tags : ap, mining

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info